ePaper
Thursday, October 1, 2026
ePaper
Homeతెలంగాణడిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు.

డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు.

📰 Generate e-Paper Clip

డిపెండెంట్ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు.

నామమాత్రంగా మెడికల్ బోర్డులు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోంసింగరేణి బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణకార్పొరేట్లతో కలిసి సింగరేణిపై ప్రభుత్వం కుట్ర చేస్తోందని వ్యాఖ్య.

అర్జున్ సమాచారం //సెప్టెంబర్ 30//బంజారాహిల్స్, హైదరాబాద్:

డిపెండెంట్ ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చే దానం, ధర్మం కాదని, అవి సింగరేణి కార్మికుల హక్కు అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కారుణ్య నియామకాలను తగ్గిస్తూ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.

సింగరేణిలో మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులకు మెడికల్ బోర్డులు ఏర్పాటు చేయకుండా కాలయాపన చేశారని కవిత పేర్కొన్నారు. హెచ్‌ఎంఎస్, తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ‘సింగరేణి బాయిబాట’ కార్యక్రమం నిర్వహించి, మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోతే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించిన అనంతరం నామమాత్రంగా బోర్డులు నిర్వహిస్తున్నారని అన్నారు.

రెండు నెలలుగా నిర్వహిస్తున్న మెడికల్ బోర్డుల్లో 12.5 శాతం మంది కార్మికులను మాత్రమే అన్‌ఫిట్‌గా ప్రకటించి, మిగతా వారిని డ్యూటీ ఫిట్‌గా పేర్కొంటూ పంపిస్తున్నారని ఆరోపించారు. వారిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్‌ఫిట్‌గా ప్రకటించి వారి వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

సింగరేణిలో మెరుగైన నాణ్యత గల బొగ్గు ఉంది

సింగరేణి బొగ్గు నాణ్యతపై ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని కవిత ఆరోపించారు. సింగరేణిలో జీ-3 నుంచి జీ-8 వరకు మెరుగైన గ్రేడ్ బొగ్గు అందుబాటులో ఉందని తెలిపారు. జీ-9 బొగ్గు కూడా పలు సింగరేణి ప్రాజెక్టులు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లలో అందుబాటులో ఉందని పేర్కొన్నారు.

సింగరేణికి ప్రభుత్వం బాకీ ఉన్న రూ.54 వేల కోట్లను చెల్లించకుండా ఉండేందుకే బొగ్గు నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారని ఆమె ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడం వెనుక ప్రైవేటు సంస్థలకు లాభం చేకూర్చే ప్రయత్నం ఉందని వ్యాఖ్యానించారు.

కొన్ని కార్పొరేట్ సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి సింగరేణి సంస్థను, శాశ్వత ఉద్యోగ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని కవిత ఆరోపించారు. సింగరేణిపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలకు వివరిస్తామని, వాటిని అడ్డుకునేందుకు తెలంగాణ రక్షణ సేన పోరాడుతుందని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!