ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeతెలంగాణపశు వైద్యాధికారి లేక పశుపోషకుల అవస్థలు అత్యవసర వేళల్లో అందని వైద్యం.. ప్రైవేట్ వైద్యులపై ఆధారం.

పశు వైద్యాధికారి లేక పశుపోషకుల అవస్థలు అత్యవసర వేళల్లో అందని వైద్యం.. ప్రైవేట్ వైద్యులపై ఆధారం.

📰 Generate e-Paper Clip

పశు వైద్యాధికారి లేక పశుపోషకుల అవస్థలు అత్యవసర వేళల్లో అందని వైద్యం.. ప్రైవేట్ వైద్యులపై ఆధారం.

అర్జున్ సమాచారం // సెప్టెంబర్ 30 // ముత్తారం. రిపోర్టర్

ముత్తారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పశువైద్యశాలలో పూర్తిస్థాయి పశు వైద్యాధికారి లేకపోవడంతో రైతులు, పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముత్తారంలో పనిచేసిన పశు వైద్యాధికారి (VAS) డెప్యుటేషన్‌పై కరీంనగర్ జిల్లాకు వెళ్లడంతో గత కొంతకాలంగా పోస్టు ఖాళీగా ఉంది.

మండలంలో వ్యవసాయంతో పాటు పశుపోషణపై ఆధారపడే కుటుంబాలు వందల సంఖ్యలో ఉన్నాయి. పశువులకు అనారోగ్యం కలిగినప్పుడు అత్యవసరంగా వైద్యం అందకపోవడంతో రైతులు ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వైద్యం కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు.

అదేవిధంగా పశువుల కొనుగోలు, బీమా తదితర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల కోసం కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ముత్తారం ప్రభుత్వ పశువైద్యశాలకు పూర్తిస్థాయి పశు వైద్యాధికారిని నియమించి, పశుపోషకుల సమస్యలను పరిష్కరించాలని రైతులు, పశుపోషకులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!