అర్జున్ సమాచారం:
తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం రాజకీయంగా వేడి పుట్టించింది. రెండు సీట్లనూ రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించడంపై తెలంగాణ రాజ్య అధికార పార్టీ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆరోపణలు చేశారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, సీనియర్ నేత జానారెడ్డి నాటకమాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరా
కాంగ్రెస్ ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులు కేవలం ‘బలిపశువులు’ మాత్రమేనని మల్లన్న అభివర్ణించారు. పార్టీ గెలవడం కాదు, రెడ్లు గెలవాలన్నదే వారి లక్ష్యమని, దీని కోసం బీఆర్ఎస్‌లోని ఒక వ్యక్తితో రహస్య ఒప్పందం కూడా కుదిరిందని ఆరోపించారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్‌కు గతంలో కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదని, తాను గెలిచిన తర్వాతే అక్కడ ఆ పార్టీకి గుర్తింపు వచ్చిందని గుర్తుచేశారు.
ఈ ఎన్నికలు రెడ్లు, వెలమలకు, బీసీలకు మధ్య జరుగుతున్న పోరాటంగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో బీసీ వాదం లేదని నిరూపించే ప్రయత్నం జరుగుతోందన్నారు. తమ తెలంగాణ రాజ్య అధికార పార్టీ తరఫున రెండు స్థానాల్లోనూ బీసీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపిస్తామని తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. తన అభ్యర్థిత్వంపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపారు.
=======================

