ePaper
Wednesday, September 30, 2026
ePaper
Homeతెలంగాణముగిసిన కంపెనీ స్థాయి కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు. కబడ్డీలో ఆర్జీ-1, 2 ఏరియా జట్టు...

ముగిసిన కంపెనీ స్థాయి కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు. కబడ్డీలో ఆర్జీ-1, 2 ఏరియా జట్టు విజయంబాల్ బ్యాడ్మింటన్‌లో బెల్లంపల్లి–మందమర్రి ఏరియా జట్టు విజేత

📰 Generate e-Paper Clip

ముగిసిన కంపెనీ స్థాయి కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు. కబడ్డీలో ఆర్జీ-1, 2 ఏరియా జట్టు విజయంబాల్ బ్యాడ్మింటన్‌లో బెల్లంపల్లి–మందమర్రి ఏరియా జట్టు విజేత.

అర్జున్ సమాచారం // సెప్టెంబర్ 30 // రామగిరి. రిపోర్టర్.

క్రీడా స్ఫూర్తితో పోటీల్లో రాణించి కోల్ ఇండియా స్థాయి పోటీల్లో సింగరేణి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని రామగుండం ఆర్జీ-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు అన్నారు.

రామగుండం ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన కంపెనీ స్థాయి కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ పోటీలు బుధవారం స్థానిక రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో ముగిశాయి. ముఖ్య అతిథులుగా పాల్గొన్న జీఎంలు విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు పట్టు వదలకుండా నిరంతరం సాధన చేస్తే విజయం సాధించవచ్చని అన్నారు. కోల్ ఇండియా స్థాయి పోటీల్లో రాణించి సింగరేణికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.

పోటీల్లో బెల్లంపల్లి–మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం–1, 2, రామగుండం ఆర్జీ-3–భూపాలపల్లి, మణుగూరు–ఇల్లందు, కార్పొరేట్–కొత్తగూడెం రీజియన్ల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

కబడ్డీలో ఆర్జీ-1, 2 ఏరియా జట్టు విజేతగా నిలవగా, బాల్ బ్యాడ్మింటన్‌లో బెల్లంపల్లి–మందమర్రి ఏరియా జట్టు విజయం సాధించింది.

కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు ఎం. రామచంద్రరెడ్డి, కోట రవీందర్‌రెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్, ఏరియా ఇంజినీర్ ఎ. ఉదయభాస్కర్, పర్సనల్ విభాగాధిపతి బి. సుదర్శనం, ఐఈడీజీఎం బి.టి. మురళీకృష్ణ, ఫైనాన్స్ డీజీఎం సి.జె. సురేఖ, కార్పొరేట్ స్పోర్ట్స్ సూపర్‌వైజర్ ఫాస్ట్‌నెట్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ పర్స శ్రీనివాస్, గౌరవ కార్యదర్శి ఎన్. వంశీధర్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ బుర్ల సదానందం, ఇతర అధికారులు, స్పోర్ట్స్ సూపర్‌వైజర్లు, కార్మిక సంఘాల నాయకులు, సీనియర్ క్రీడాకారులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!