హైదరాబాద్,అర్జున్ సమాచారం:
సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభలో తన హోటళ్ల గురించి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
తాను 2009 ఎన్నికల అఫిడవిట్‌లోనే తన వ్యాపార వివరాలను వెల్లడించానని కేటీఆర్ తెలిపారు. తనకు హోటల్ వ్యాపారం ఉందని ఇప్పుడు కొత్తగా ఏదో కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.
నా భార్యా పిల్లలకు బువ్వ పెట్టేందుకు నేను వ్యాపారం చేస్తున్నాను. నాకు మూడు హోటళ్లు ఉన్నాయి. రాజకీయాలు వదిలేసి పూర్తిగా వ్యాపారాలపై దృష్టి పెట్టి ఉంటే ఇప్పటికి పది హోటళ్లు ఉండేవి.నా హోటళ్లకు పబ్లిసిటీ చేసినందుకు రేవంత్‌రెడ్డికి థాంక్స్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా,సిరిసిల్ల సభలో రేవంత్‌రెడ్డి కేటీఆర్‌కు హైటెక్ సిటీ పరిసరాల్లో మూడు హోటళ్లు ఉన్నాయని ఆరోపించారు.ఈ ఆరోపణలను కేటీఆర్ తనదైన శైలిలో స్పందిస్తూ రాజకీయంగా కౌంటర్ ఇచ్చారు.
=========================

