ePaper
Friday, October 2, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఇందారంలో వరుస చోరీలు.. మేనల్లుడే దొంగగా అరెస్ట్ ,చాకచక్యంగా దొంగనుపట్టుకున్న పోలీసులు.

ఇందారంలో వరుస చోరీలు.. మేనల్లుడే దొంగగా అరెస్ట్ ,చాకచక్యంగా దొంగనుపట్టుకున్న పోలీసులు.

📰 Generate e-Paper Clip

ఇందారంలో వరుస చోరీలు.. మేనల్లుడే దొంగగా అరెస్ట్ ,చాకచక్యంగా దొంగనుపట్టుకున్న పోలీసులు.

అర్జున్: సమాచారం చెన్నూర్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్ 2.

మంచిర్యాల జిల్లా: జైపూర్ మండలం ఇందారం గ్రామంలో జరిగిన వరుస చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పెళ్లికి హైదరాబాద్ వెళ్లిన ఇద్దరు అన్నదమ్ముల ఇళ్లలో చోరీ జరిగిన విషయం తెలిసిందే.
పోలీసుల విచారణలో సంచలన విషయం బయటపడింది. బాధితుల మేనల్లుడు మహ్మద్ మద్గుల (22), బెల్లంపల్లి తన స్నేహితుడు సబ్బు లక్ష్మీనారాయణ (27) తో కలిసి చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు.

తన మేనమామ కూతురును ఇచ్చి పెళ్లి చేయలేదనే కోపంతో పగ పెంచుకున్న మద్గుల, మేనమామలు పెళ్లి బట్టల కోసం హైదరాబాద్ వెళ్లిన సమయంలో (సెప్టెంబర్ 28) రాత్రి 10:30 గంటలకు AP-15-BF-5476 బైక్ పై వెళ్లి గడ్డపారతో తాళాలు పగలగొట్టి చోరీ చేసినట్లు తెలిపాడు.
ఒక ఇంట్లో రూ.60,000 నగదు, 13 తులాల బంగారు నెక్లెస్, సెవెన్ పీస్ తో పాటు వెండి పట్టీలు, రెండో ఇంట్లో బంగారు జూకా, పూసలు, పిల్లల గోల్డ్ చైన్, రింగులు ఎత్తుకెళ్లారు. చోరీ సొత్తును బెల్లంపల్లిలోని నిందితుడి ఇంట్లో దాచి, నగదు రూ.35,000, రూ.25,000 చొప్పున పంచుకొని హైదరాబాద్ లో విలాసవంతంగా గడిపినట్లు పోలీసులకు తెలిపారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!