కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
సెప్టెంబర్ నెల బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను
రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా ఎస్వోటుజియం బండిసత్యనారాయణ గురువారం రామగిరి మండలం సేంటినరీ కాలనీ లోని జీ.యం కార్యక్రమంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా వివరాలను వెల్లడించారు.
రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో రామగుండం-3 ఏరియాకు నిర్దేశించిన 2.30 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 1.50 లక్షల టన్నులు అనగా 65 శాతం బొగ్గు ఉత్పత్తి, తో పాటు, కంపనీ షావల్స్ కు నిర్దేశించిన 08.00 లక్షల క్యూబిక్ మీటర్ల ఓ.బి(మట్టి) వెలికితీత లక్ష్యానికి గాను, 7.42 లక్షల క్యూబిక్ మీటర్లు అనగా 93 శాతం ఓ.బి (మట్టి) వెలికి తీయడం జరిగిందని, ఆఫ్ లోడింగ్ కు నిర్దేశించిన 13:00 లక్షల క్యూబిక్ మీటర్ల ఓ.బి లక్ష్యానికి గాను 9.84 లక్షల క్యూబిక్ మీటర్లు అనగా 76 శాతం మట్టిని వెలికితీయడం జరిగిందన్నారు.అదేవిధంగా 3.67 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు.
తదుపరి గనుల వారిగా ఉత్పత్తి వివరాలను తెలియజేస్తూ ఆగస్టు నెలలో ఓ.సి.పి-1 గనికి నిర్దేశించిన 0.30 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 0.60 లక్షల టన్నులు అనగా 201 శాతం, ఓ.సి.పి-2 గనికి నిర్దేశించిన 2.00 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 0.90 లక్షల టన్నులు అనగా 45 శాతం బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. భవిషత్తులో కూడా లక్ష్యానికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయడానికి తగిన చర్యలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని కోరారు.సెప్టెంబర్ మాసంలో అధిక వర్షాలు కురిసి నందున ఉత్పత్తిలో కొంత వెనుకపడ్డామని, ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా పనిచేస్తూ సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను భద్రత తో సాధించడానికి కృషి చేయాలన్నారు.
అనంతరం అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా ఎస్వోటుజిఎం బండి సత్యనారాయణ మాట్లాడుతూ అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ కు సెప్టెంబర్ నెలలో నిర్దేశించిన 15,300 టన్నుల లక్ష్యానికి గాను 14,224 టన్నులు బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు.4వ ప్యానల్ తయారీ పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే పనులు పూర్తి చేసి నిర్దేశించిన లక్ష్యాలను భద్రతతో సాధించడానికి ఉద్యోగులందరూ కృషి చేయాలన్నారు.అలాగే ఉద్యోగులు చాలా మంది గైర్హాజరు అవుతున్నారని, గైర్హాజరు కాకుండా విధులు సక్రమంగా నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్వోటుజియం యం.రామ్మోహన్, ఏరియా ఇంజినీర్ ఎ.ఉదయ భాస్కర్, ఐ ఇ డీజీఎం బి.టి.మురళీ కృష్ణ, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, డివై పియం యండి.ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
=========================

