ePaper
Friday, October 2, 2026
ePaper
Homeతెలంగాణవిశిష్ట సేవలకు ఘన సత్కారం.. రమేష్ బాబు దంపతులకు ఆత్మీయ వీడ్కోలు! పదవీ విరమణ సందర్భంగా...

విశిష్ట సేవలకు ఘన సత్కారం.. రమేష్ బాబు దంపతులకు ఆత్మీయ వీడ్కోలు! పదవీ విరమణ సందర్భంగా అభినందించిన టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ

📰 Generate e-Paper Clip

విశిష్ట సేవలకు ఘన సత్కారం.. రమేష్ బాబు దంపతులకు ఆత్మీయ వీడ్కోలు! పదవీ విరమణ సందర్భంగా అభినందించిన టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ.

అర్జున్ సమాచారం. అక్టోబర్ 02. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

మంచిర్యాలజిల్లా: ఉద్యోగ జీవితంలో సుదీర్ఘకాలం అంకితభావంతో సేవలందించి పదవీ విరమణ పొందిన ఉపాధి కల్పన శాఖ అధికారి, టీఎన్జీవో మంచిర్యాల జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు యతిపతి రమేష్ బాబు దంపతులను టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఘనంగా సన్మానించింది. జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు సంద అశోక్ హాజరై రమేష్ బాబు దంపతులకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉపాధి కల్పన శాఖలో రమేష్ బాబు సుదీర్ఘకాలం ఉత్తమ సేవలందించి శాఖకు మంచి గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా సంఘంలో వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉద్యోగుల సంక్షేమం కోసం చేసిన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, మనవళ్లు, మనవరాళ్లతో కలిసి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా గృహ నిర్మాణ సంఘం కార్యదర్శి హబీబ్ హుస్సేన్, జిల్లా మాజీ కార్యదర్శి పుప్పాల హనుమంతరావు, జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్నమల్లయ్య, సహాధ్యక్షుడు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, బెల్లంపల్లి విభాగం అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!