ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బృందం కరపత్రాల పంపిణీ ప్రచారం.
గోదావరిఖని: అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 12.
:
రామగుండం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు, ఈరోజు ఆర్జి 1 ఏరియాలోని GDK-11A మైన్, ఓసీపీ-5 ప్రాజెక్టు, ఏరియా వర్క్ షాప్, సింగరేణి ఏరియా హాస్పిటల్, మరియు మిగతా బొగ్గు గనుల వద్ద ఈరోజు ఉదయం ఎమ్మెల్యే బృందం కరపత్రాలను పంపిణీ చేసింది.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కార్మికులకు జరిగిన అన్యాయం, కార్మికుల హక్కులు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను కరపత్రాల ద్వారా కార్మికులకు వివరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థకు సంబంధించిన నిధుల వినియోగం, కార్మికుల ఆదాయపు పన్ను మినహాయింపు, సొంత ఇంటి పథకం, లాభాల వాటా చెల్లింపులు, మెడికల్ బోర్డు ద్వారా వారసత్వ ఉద్యోగాల కల్పన వంటి అంశాల్లో కార్మికులకు ఎదురైన సమస్యలను కరపత్రాల్లో ప్రస్తావించారు.
అదేవిధంగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న అంశాలను వివరించారు. కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు, ఆదాయపు పన్ను మినహాయింపు, లాభాల వాటా చెల్లింపులు, వారసత్వ ఉద్యోగాల వంటి కీలక అంశాల పరిష్కారానికి కృషి చేస్తున్న విషయాలను తెలియజేశారు.
సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం, సంస్థ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నాయకత్వంలో నిరంతరం కృషి చేస్తామని బృందం సభ్యులు తెలిపారు. కార్మికుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం జరిగేలా కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కరపత్రాల పంపిణీ కార్యక్రమంలోరామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ టీం సభ్యులు జనగాం శ్రీనివాస్ గౌడ్, అరగంట కృష్ణ, భాస్కర్ కిరణ్, పాకాల సాయికుమార్, బద్రి శంకర్,
ఎల్.ఆంజనేయులు,
గోషికే కనకయ్య, మండల రమేష్, దార సుశీల, రవికుమార్,కుమారస్వామి సంపత్,మామిడి శ్రీనివాస్ లతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

