ePaper
Monday, October 12, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్రోడ్లపై కాదు.. ఆధారాలతో ఈసీ వద్దకు వెళ్లండి ఈటల రాజేందర్ ఢిల్లీలో...

రోడ్లపై కాదు.. ఆధారాలతో ఈసీ వద్దకు వెళ్లండి ఈటల రాజేందర్ ఢిల్లీలో ఇండియా కూటమి నిరసనలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందన ఆందోళనలతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వ్యాఖ్య

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:
ఆధారాలుంటే ఎన్నికల సంఘాన్ని కలవాలని ప్రతిపక్షాలకు సూచన
ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమాలపై బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఈ ఆందోళనల వల్ల రాజధాని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రతిపక్ష నేతలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఈటల… ప్రతిపక్షాల తీరుపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు చేసేవారు, అందుకు సంబంధించిన ఆధారాలతో ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని ఈటల సూచించారు. “ఎన్నికల సంఘం నుంచి అపాయింట్‌మెంట్ తీసుకుని, మీ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించండి. అంతేగానీ, ఇలా రోడ్లెక్కి ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదు” అని ఆయన అన్నారు. గతంలో బీహార్‌లో ‘ఓట్ల దొంగతనం’ జరిగిందని ఇలాగే ఆరోపించారని, కానీ దాని ఫలితం ఏమైందో గుర్తుచేసుకోవాలని అన్నారు. బీహార్ ఎన్నికల నుంచి ఇండియా కూటమి గుణపాఠం నేర్చుకోవాలని ఈటల హితవు పలికారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పోరాడటం నేర్చుకోవాలని ఆయన సూచించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ‘చలో ఢిల్లీ – మార్చ్ ఫర్ డెమోక్రసీ’ పేరుతో ఇండియా కూటమి సుప్రీంకోర్టుకు పాదయాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నిరసనల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో పాటు, కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!