ePaper
Friday, October 16, 2026
ePaper
Homeతెలంగాణనిజామాబాద్లక్కీ డ్రా ద్వారా బార్ లైసెన్సు కేటాయింపు కలెక్టర్ నేతృత్వంలో కొనసాగిన...

లక్కీ డ్రా ద్వారా బార్ లైసెన్సు కేటాయింపు కలెక్టర్ నేతృత్వంలో కొనసాగిన ప్రక్రియ

📰 Generate e-Paper Clip

నిజామాబాద్,అర్జున్ సమాచారం:
బోధన్ పట్టణానికి నూతనంగా మంజూరైన మద్యం బార్ కు లాటరీ ద్వారా లైసెన్సు జారీ కోసం శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఈ ప్రక్రియ కొనసాగింది. బార్ లైసెన్సు కోసం మొత్తం 19 దరఖాస్తులు దాఖలయ్యాయి. దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీసి బార్ కేటాయింపు కోసం లైసెన్స్ ఖరారు చేశారు. లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్ లను అందరికీ చూపిస్తూ, పారదర్శకంగా డ్రా నిర్వహించారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం నుండి చివరి వరకు ఫొటో, వీడియో చిత్రీకరణ జరిపించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీధర్, సూపరింటెండెంట్ నందగోపాల్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి, బోధన్ ఎక్సైజ్ సీ.ఐ భాస్కర్ తదితర అధికారులు లక్కీ డ్రా నిర్వహణ ప్రక్రియలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!