ePaper
Sunday, October 18, 2026
ePaper
Homeజగిత్యాలజగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి...

జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

📰 Generate e-Paper Clip

జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తాం, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

జగిత్యాల జిల్లా ప్రతినిధి ::అర్జున్ సమాచారం అక్టోబర్ 16::

అర్బన్ హౌసింగ్ కాలనీలో రూ.2.77 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన
అర్బన్ హౌసింగ్ కాలని ప్రజలు ,విద్యార్థుల రవాణా సౌకర్యార్థం ఆర్ టి సి బస్సు ను ప్రారంభించారు.
జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో రూ.2.77 కోట్ల నిధులతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్‌తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. అర్బన్ హౌసింగ్ కాలనీలో నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించాలనే ఉద్దేశంతో రూ.2.77 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సబ్‌స్టేషన్ అందుబాటులోకి రావడం ద్వారా కాలనీలో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించేందుకు కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. అర్బన్ హౌసింగ్ కాలనీలో నివసిస్తున్న ప్రజల్లో ఇప్పటివరకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందని వారు సంబంధిత అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకొని పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అదేవిధంగా కాలనీలోని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల వారికి ప్రార్థనా స్థలాలు ఏర్పాటు చేసే అంశంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హిందూ సోదరులకు దేవాలయం, ముస్లింలకు మసీదు, క్రైస్తవులకు చర్చి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. కాలనీలో సెల్‌ఫోన్ సిగ్నల్ సమస్య ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ సమస్య పరిష్కారానికి మొబైల్ టవర్ ఏర్పాటు చేసేలా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కాలనీలో నివసించే ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో బస్సు సర్వీసును ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ తదితర మౌలిక సదుపాయాలతో పాటు ప్రజలకు అవసరమైన ఇతర సౌకర్యాలను కూడా దశలవారీగా కల్పిస్తామని చెప్పారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటూ, ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ

అర్బన్ హౌసింగ్ కాలనీలో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కాలనీలో విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు రూ.2.77 కోట్లతో సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టడం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రజల రవాణా సౌకర్యార్థం బస్సు సర్వీసును ప్రారంభించడం ద్వారా కాలనీ వాసులకు రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వాటి ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించారు. కాలనీలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపడుతూ కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ

జిల్లాలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అర్బన్ హౌసింగ్ కాలనీలో రూ.2.77 కోట్లతో నిర్మించనున్న విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలనీలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గృహజ్యోతి పథకం కింద అర్హత ఉన్నప్పటికీ ఉచిత విద్యుత్ ప్రయోజనం పొందని కుటుంబాలు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజలకు విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ వంటి సదుపాయాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటూ, కాలనీ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజంగినందయ్య,మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు గట్టు సతీష్,జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్,విద్యుత్ శాఖ అధికారులు, హౌసింగ్అధికారులు, తహసీల్దార్, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!