ePaper
Saturday, October 17, 2026
ePaper
Homeఆరోగ్యంతక్కువ బరువుతో ఉన్న కౌమార బాలికలకు మునగ ఆకుల చపాతీ పిండి పోషకాహారంగా దోహదం

తక్కువ బరువుతో ఉన్న కౌమార బాలికలకు మునగ ఆకుల చపాతీ పిండి పోషకాహారంగా దోహదం

📰 Generate e-Paper Clip

తక్కువ బరువుతో ఉన్న కౌమార బాలికలకు మునగ ఆకుల చపాతీ పిండి పోషకాహారంగా దోహదం.

బాలికల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సమతుల్య ఆహారం అవసరం: డాక్టర్ నవ్యరావు, సర్పంచ్ పల్లె ప్రతిమ.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 16 // రామగిరి రిపోర్టర్.

తక్కువ బరువుతో ఉన్న కౌమార బాలికలకు మునగ ఆకుల చపాతీ పిండి పోషకాహార అనుబంధంగా ఉపయోగపడుతుందని రామగిరి మండలం రత్నాపూర్ కృషి విజ్ఞాన కేంద్రం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బైరినేని నవ్యరావు, గ్రామ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు పేర్కొన్నారు. శుక్రవారం రత్నాపూర్ గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బాలికలకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రథమ శ్రేణి ప్రదర్శనా క్షేత్రం కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తక్కువ బరువుతో ఉన్న కౌమార బాలికలకు మునగ ఆకుల పొడితో తయారు చేసిన చపాతీ పిండిని పోషకాహార అనుబంధంగా వినియోగించే విధానంపై వివరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ నవ్యరావు మాట్లాడుతూ.. మునగ ఆకుల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, ఇనుము, ప్రోటీన్లు వంటి పోషకాలు ఉంటాయని తెలిపారు. మునగ ఆకుల పొడిని తగిన మోతాదులో చపాతీ పిండిలో కలిపి వినియోగించడం ద్వారా ఆహారంలో పోషక విలువలను పెంచుకోవచ్చని వివరించారు. కౌమార దశలో బాలికల శారీరక ఎదుగుదలకు సమతుల్య ఆహారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు, ఇతర పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. తక్కువ బరువుతో ఉన్న బాలికలు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు అవసరమైనప్పుడు వైద్యుల సలహా తీసుకోవాలని తెలిపారు.

గ్రామ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు మాట్లాడుతూ.. బాలికలు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామీణ మహిళలు, బాలికలు కృషి విజ్ఞాన కేంద్రం అందించే శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లో బాలికల పోషకాహార స్థితిని మెరుగుపరచడం, స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార వనరుల వినియోగంపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని డాక్టర్ నవ్యరావు వివరించారు. ఈ సందర్భంగా పలువురు బాలికలు, మహిళలకు మునగ ఆకుల చపాతీ పిండి పోషకాహారాన్ని ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాద్రాపు ప్రవళిక ప్రశాంత్, కార్యదర్శి గంగుల సంతోష్, వార్డు సభ్యులు పబ్బా స్రవంతి వెంకటేష్, కెక్కర్ల ఉష అశోక్, బత్తిని ప్రశాంత్, బత్తుల రాజమణి రమేష్, కలవేన రవి, కారోబార్ కొండపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!