ePaper
Sunday, October 18, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత.. యాసంగిలో వరి సాగు చేయవద్దు ఉమ్మడి కరీంనగర్...

తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత.. యాసంగిలో వరి సాగు చేయవద్దు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి స్పెషల్ చీఫ్ సెక్రటరీ బెనహుర్ మహేష్ దత్ ఎక్కా

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:
సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో తాగునీరు, విద్యుత్, సాగునీటి అవసరాలకు సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని, తాగునీటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ యాసంగి సీజన్‌లో వరి సాగు చేయకుండా రైతులకు అవగాహన కల్పించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కా అధికారులను ఆదేశించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రానున్న పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచించారు.
కరీంనగర్ కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్  హల్ లో శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు చిత్ర మిశ్రా, బి. సత్య ప్రసాద్, కోయ శ్రీహర్ష, గరీమ అగర్వాల్ లతో కలిసి ప్రత్యేక అధికారి  బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కా సమీక్ష నిర్వహించారు.
ఉమ్మడి జిల్లా ఉన్నత అధికారులు
వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల, తాగునీటి సరఫరా, భూగర్భ జలాలు, నీటి సంరక్షణ, ఉపాధి హామీ, మున్సిపాలిటీల్లో అమృత్ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివరాలు సమర్పించారు.
ఈ సందర్బంగా ప్రత్యేక అధికారి  బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కామాట్లాడుతూ. సూపర్ ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ప్రణాళికలు రూపొందించుకోవాలని తెలిపారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా నదుల్లో నీటి నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయని, కొత్తగా నీటి ప్రవాహాలు లేని పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల బోరు బావులు ఉండగా, వాటిలో 5 నుంచి 6 లక్షల వరకు పనిచేయని పరిస్థితి ఉందని, భూగర్భ జలాలు వేగంగా తగ్గుతున్నాయని తెలిపారు.
యాసంగి సీజన్‌లో వరి సాగుకు నీటి లభ్యత ఉండే అవకాశం లేనందున రైతులను వరి సాగు నుంచి దూరంగా ఉంచేందుకు గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగు చేయకుండా ఉండాలని, తక్కువ నీటితో, తక్కువ వ్యవధిలో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని ఆదేశించారు.
ఆయిల్ పామ్, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి పంటలను ప్రోత్సహించాలని, కోతులు, ఇతర సమస్యలు లేని ప్రాంతాల్లో కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితి, పంటల అవసరాలను వివరించాలని తెలిపారు. రైతులు నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా సాగు చేసి నష్టపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
ఈ సమీక్షలో కరీంనగర్  మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రపుల్ దేశాయి, అదనపు కలెక్టర్ అశ్వినీ తానజీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల  వ్యవసాయ, సాగునీటి, విద్యుత్, మిషన్ భగీరథ, భూగర్భ జలాలు, మార్కెటింగ్, పశుసంవర్ధక, మున్సిపల్ శాఖల అధికారులు, ఇతర సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!