ePaper
Tuesday, October 20, 2026
ePaper
Homeతెలంగాణఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రికి ఘనంగా స్వాగతం.

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రికి ఘనంగా స్వాగతం.

📰 Generate e-Paper Clip

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రికి ఘనంగా స్వాగతం.

కమాన్ పూర్/మంథని; అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 19.

మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి, శ్రీ లలితాంబిక, శ్రీ షిరిడి సాయిబాబా ఆలయాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల  శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు దుద్దిళ్ల మారుతి, వొజ్జల గణేష్, పల్లి మురళి ల ఆధ్వర్యంలో వేద పాఠశాల విద్యార్థులు వేద మంత్రాలతో మంత్రికి స్వాగతం పలికారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మంత్రి శ్రీధర్ బాబు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి శ్రీధర్ బాబు తీసుకుంటున్న నిర్ణయాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయాల్లో శ్రీధర్ బాబును శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం గాంధీచౌక్ తో ఇతర ప్రాంతాల్లోని బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
 ఈ కార్యక్రమాల్లో ఆలయాల అర్చకులు మారుపాక ప్రశాంత్ శర్మ, పల్లి మురళీధర్, మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి, కౌన్సిలర్  పెంటరి రాజు, రామడుగు సాయి శ్రీనివాస్, కె వి ఎల్ ఎన్ హరిబాబు, కొల్లారపు శ్రీనివాస్, శ్రీరంభట్ల శ్రీనివాస్, మహావాది జలజ, మన కంటి మురళి, దుద్దిళ్ల గణపతి, మహావాది దయానంద్, పల్లి ప్రహ్లాద్, పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!