ePaper
Monday, October 19, 2026
ePaper
Homeతెలంగాణగ్రామాభివృద్ధికి సల్మాన్‌ఖాన్‌ కృషి మరువలేనిది.సల్మాన్‌ ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలి.

గ్రామాభివృద్ధికి సల్మాన్‌ఖాన్‌ కృషి మరువలేనిది.సల్మాన్‌ ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలి.

📰 Generate e-Paper Clip

గ్రామాభివృద్ధికి సల్మాన్‌ఖాన్‌ కృషి మరువలేనిది.సల్మాన్‌ ఆశయాలు, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలి.

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌.

అర్జున్ సమాచారం: అక్టోబర్ 17// మహాదేవపూర్ డెస్క్.

మహదేవ్‌పూర్ గ్రామాభివృద్ధికి మాజీ ఉపసర్పంచ్‌ సల్మాన్‌ఖాన్‌ చేసిన సేవలు,  మరువలేనివని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. సల్మాన్‌ఖాన్‌ స్మారకార్థం మహదేవ్‌పూర్‌లో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పుట్ట మధూకర్‌ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సల్మాన్‌ఖాన్‌ నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన స్మారకార్థం ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదన్నారు. మాటలు చెప్పడం కంటే ఆచరణలో చేసి చూపించడం ముఖ్యమని, తన పనితీరుతో సల్మాన్‌ఖాన్‌ అనేక విషయాల్లో గొప్ప సందేశాన్ని అందించారని గుర్తుచేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల మధ్య భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నప్పటికీ, మహదేవ్‌పూర్‌లో సర్పంచ్‌ నిర్ణయాలకు అనుగుణంగా ఉపసర్పంచ్‌గా సల్మాన్‌ఖాన్‌ నిబద్ధతతో పనిచేశారని తెలిపారు. ఆయనలో నమ్మకం, ధైర్యం, ఉత్సాహం మెండుగా ఉండేవని కొనియాడారు.

ఈ ప్రాంతానికి చెందిన యువతకు అవకాశం లభిస్తే తమ ప్రతిభను చాటుకోవడంలో ఎవరికి తీసిపోరని, ఈ క్రికెట్‌ టోర్నమెంట్‌లోనూ స్థానిక క్రీడాకారులు ప్రతిభ కనబరచడం గర్వకారణమని అన్నారు. సల్మాన్‌ఖాన్‌ స్మారకార్థం నిర్వహించిన క్రికెట్‌ పోటీలను ప్రతి సంవత్సరం కొనసాగించాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ టోర్నమెంట్‌ నిర్వహణకు తన వంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగలరని పేర్కొన్నారు. గ్రామీణ క్రీడలను క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు వేదికగా మలుచుకుని, ఉన్నత స్థాయికి ఎదగాలని పుట్ట మధూకర్‌ ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!