ePaper
Friday, October 23, 2026
ePaper
Homeతెలంగాణవరంగల్మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం

మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం

📰 Generate e-Paper Clip

హనుమకొండ, అర్జున్ సమాచారం:
వరంగల్ రెండో రాజధాని అని మంత్రులు పదేపదే చెబుతున్న ప్రకటనలకు, అభివృ ద్ధిలో ప్రభుత్వ తీరుకు పొంతన కుదరడం లేదు. రవాణాలో కీలకమైన హనుమకొండ బస్ స్టేషన్ కొత్త భవనం నిర్మాణంలో కాంగ్రెస్ సర్కారు నిర్ణ క్ష్యంగా వ్యవహరిస్తున్నది. ప్రతి రోజూ 3 లక్షల మంది రాకపోకలు సాగించే ఈ బస్టాండ్ కొత్త భవన నిర్మాణాన్ని పట్టించుకోవడంలేదు. అధికారంలోకి వచ్చి మూడేండ్లు పూర్తవుతున్నా ఒక్క ఇటుకైనా పెట్టలేదు. దీని నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.83 కోట్లు మంజూరు చేసింది. 2023 అక్టో బర్లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పనులు మొదలు కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మూడేండ్లు పూర్తవుతున్నా దాని ముచ్చటే మరిచింది.
పట్టించుకోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు: ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పట్టించుకోకపో వడంతో హనుమకొండ బస్టేషన్ కొత్త భవన నిర్మాణ పనులు మొదలు కావడంలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన పనులను పూర్తి చేసే విషయంలోనూ కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తు న్నది. అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు లేదు. పాత పనులను పూర్తి చేసేందుకు మంజూరైన నిధులను విడుదల చేయడం లేదు. లక్షల మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయే హనుమకొండ బస్ స్టేషన్ ప్రస్తుతం దయనీయంగా ఉన్నది. ఎలాంటి వసతులు లేక ప్రయాణికులు ఇబ్బంది. పడుతున్నారు. మహిళా ప్రయాణికులు అవస్థలు చెప్పలేని విధంగా ఉన్నా యి. టాయిలెట్స్ వసతి లేదు. తాగునీరు అసలే ఉండడంలేదు. పండుగ సమయాల్లో రోజువారీ కంటే రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు వస్తుం టారు. బస్సుల కోసం నిల్చునేందుకు వారికి స్థలం సరిపోవడం లేదు. శిథి లావస్థలో ఉన్న ప్రస్తుత భవనానికి మరమ్మతులు చేసినా ఉపయోగం ఉండ దని, కొత్తది నిర్మిస్తేనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని అధికారులు చెబుతున్నారు. వాటి నిర్మాణ పనులు అస్సలు మొదలు కావడంలేదు.
రద్దీ ఫుల్.. వసతులు నిల్: హనుమకొండ బస్ స్టేషన్ ప్రస్తుత భవనం 1974లో ప్రారంభ మైంది. 16 ఎకరాల విస్తీర్ణం ఉన్నా భవనం చిన్నగా ఉండడంతో రద్దీకి అనుగుణంగా వసతులు లేవు. 1990లో మరో కొత్త భవనాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ప్రయాణికులు వేల రెట్లు, వందల బస్సులు పెరి గాయి. పార్కింగ్ సౌకర్యం లేదు. ప్రస్తుత భవనం పెచ్చు లూడి శిథిలావస్థలో ఉన్నది. ఇక్కడి నుంచి ప్రతి రోజూ 1500 బస్సులు వేల సర్వీసులతో 3 లక్షల మంది ప్రయా ణిస్తుంటారు. పండుగ సీజన్లు… సోమవారం, శనివా రాల్లో 350 బస్సులు నడుస్తున్నాయి. రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నది. వరంగల్-హైదరా బాద్ రూట్లో బస్సులు సరిపోకపోవడంతో వందల ప్రైవేటు వాహనాల్లో ప్రయాణికులు వెళ్తుంటారు. రద్దీ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక వసతు లతో బస్ స్టేషన్ భవన నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.85 కోట్లు మంజూరు చేసింది. స్మార్ట్ సిటీలో భాగంగా హనుమకొండ బస్టాండు కొత్త భవనం నిర్మించేలా ఆర్టీసీ ప్రతి పాదనలు సిద్ధం చేసింది. ఆ తర్వాత దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. కొత్త భవన నిర్మాణ పనులను పట్టించుకోవడం లేదు. వసతుల లేమితో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!