ePaper
Monday, October 26, 2026
ePaper
Homeతెలంగాణమున్నూరు పటేల్ ,ట్రస్ట్ భవన్‌ నిర్మాణ పనుల పూర్తి కోసం అత్యవసర సమావేశము.

మున్నూరు పటేల్ ,ట్రస్ట్ భవన్‌ నిర్మాణ పనుల పూర్తి కోసం అత్యవసర సమావేశము.

📰 Generate e-Paper Clip

మున్నూరు పటేల్ ,ట్రస్ట్ భవన్‌ నిర్మాణ పనుల పూర్తి కోసం అత్యవసర సమావేశము.

మిగిలిన పనులపై చర్చించి, భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు సమాయత్తం.

అర్జున్ సమాచారం ; మంచిర్యాల అక్టోబరు 25.

మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు కుల బంధువులకు నమస్కారం. మున్నూరు కాపు సమాజ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్మిస్తున్న మున్నూరు కాపు ట్రస్ట్ భవన్‌ నిర్మాణ పనులు ప్రస్తుతం వీడియోలు, ఫొటోలలో చూపించే స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటివరకు కుల బంధువులు అందించిన విరాళాలతో పాటు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్‌ సాగర్‌ రావు మంజూరు చేసిన రూ.20 లక్షల నిధులతో భవన నిర్మాణ పనులు ఈ స్థాయికి చేరుకున్నాయి.

అయితే, ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్న నేపథ్యంలో వాటిని పరిశీలించి, మిగిలిన నిర్మాణ పనులను ఎలా పూర్తి చేయాలనే అంశంపై చర్చించేందుకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశానికి మంచిర్యాల జిల్లా మున్నూరు కాపు కుల బంధువులందరూ హాజరై తమ విలువైన సలహాలు, సూచనలు అందించాలని ట్రస్ట్ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అందరి సహకారం, భాగస్వామ్యంతో భవన నిర్మాణాన్ని పూర్తి చేసి, సమాజ ఆత్మగౌరవాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సమావేశ వివరాలు:తేదీ: 26-10-2026, సోమవారం సమయం: ఉదయం 11 గంటలకు
వేదిక: మున్నూరు కాపు ట్రస్ట్ భవన్, గ్రీన్ సిటీ, మంచిర్యాల.

కుల బంధువులందరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరై నిర్మాణ పనుల పూర్తికి తమ వంతు సహకారం అందించాలని వ్యవస్థాపక అధ్యక్షుడు బొలిశెట్టి రాజలింగు, చైర్మన్ నల్ల శంకర్ కోరారు.

మనందరి సమిష్టి కృషితో మున్నూరు కాపు ట్రస్ట్ భవన్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి, భావితరాలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుకుందామని వారు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!