ePaper
Thursday, October 29, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్రాజాపూర్‌లో వీధికుక్కల బెడద.. గ్రామస్థులు, పశువులపై దాడులు.

రాజాపూర్‌లో వీధికుక్కల బెడద.. గ్రామస్థులు, పశువులపై దాడులు.

📰 Generate e-Paper Clip

రాజాపూర్‌లో వీధికుక్కల బెడద.. గ్రామస్థులు, పశువులపై దాడులు.

వీధికుక్కల నియంత్రణలో అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు.. సమాచార హక్కు దరఖాస్తుపైనా స్పందన లేదని విమర్శలు.. కలెక్టర్ విచారణ జరపాలని డిమాండ్.

అర్జున్ సమాచారం .అక్టోబర్ 28 . రామగిరి రిపోర్టర్.

రామగిరి మండలం: రాజాపూర్ గ్రామంలో వీధికుక్కల బెడద తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గ్రామస్థులను, పిచ్చికుక్క 12మందిని , కరవడంతో పాటు 18 ,పశువులపైనా దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వీధికుక్కల నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు, వ్యక్తమవుతున్నాయి. గ్రామంలో వీధికుక్కల సంఖ్యపై స్పష్టమైన ప్రభుత్వ రికార్డులు లేకపోవడం, వాటి నియంత్రణకు తీసుకున్న చర్యల వివరాలు అందుబాటులో లేకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సమాచార హక్కు దరఖాస్తుకూ స్పందన లేదని ఆరోపణ.

రాజాపూర్ గ్రామంలో వీధికుక్కల సమస్యపై గతంలోనే సమాచార హక్కు చట్టం–2005 కింద సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసినట్లు దరఖాస్తుదారుడు . లింగం రాజయ్య కోరారు ఎన్ని వీధికుక్కలు ఉన్నాయి? వాటి నియంత్రణకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కుక్కల బెడద నివారణకు ఏ శాఖ బాధ్యత వహిస్తుంది? తదితర అంశాలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు దరఖాస్తు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ రికార్డుల ప్రకారం వీధికుక్కల సంఖ్య, వాటి నియంత్రణకు చేపట్టిన చర్యలు, సంబంధిత శాఖల వద్ద ఉన్న సమాచారంపై స్పష్టత లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు సంబంధించిన సమస్యపై సమాచారం కోరినప్పటికీ సమాధానం అందకపోవడం అధికారుల పనితీరుపై అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే, సంబంధిత కార్యాలయాల్లో రికార్డులు లేవన్న అంశాన్ని అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.

గ్రామ కార్యదర్శులు, పశుసంవర్ధక శాఖ పాత్రపై ప్రశ్నలు.

వీధికుక్కల నియంత్రణ విషయంలో గ్రామ కార్యదర్శులు, పశుసంవర్ధక శాఖ అధికారుల బాధ్యతపై గ్రామస్థులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీధికుక్కల వల్ల ప్రజలకు, పశువులకు ప్రమాదం ఏర్పడుతున్నప్పటికీ సమస్యను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులను పరిశీలించి బాధ్యతలను నిర్ధారించాల్సిన అవసరం ఉంది.

వీధికుక్కల దాడులు జరిగిన తర్వాత స్పందించడం కంటే, ముందుగానే వాటి సంచారాన్ని గుర్తించడం, ప్రజలకు అవగాహన కల్పించడం, సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో సమస్యను పరిష్కరించడం ముఖ్యమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో వీధికుక్కల బెడదను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

కలెక్టర్ విచారణ జరిపించాలని డిమాండ్.

రాజాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఘటనపై పెద్దపల్లి.జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించాలని దరఖాస్తుదారుడు కోరుతున్నారు. గ్రామంలో వీధికుక్కల సంఖ్య, వాటి నియంత్రణకు ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, సమాచార హక్కు దరఖాస్తుపై స్పందించకపోవడానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. సంబంధిత గ్రామ కార్యదర్శులు, పశుసంవర్ధక శాఖతో పాటు వీధికుక్కల నియంత్రణకు బాధ్యత వహించే స్థానిక సంస్థల అధికారుల పాత్రను పరిశీలించాలని కోరారు.

విచారణలో నిర్లక్ష్యం జరిగినట్లు తేలితే నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం కింద కోరిన వివరాలను నిబంధనల ప్రకారం అందించాలని కోరారు.

ప్రజల ప్రాణాలు, పశువుల భద్రతకు సంబంధించిన ఈ సమస్యను అధికారులు తేలికగా తీసుకోకుండా తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. గ్రామంలో వీధికుక్కల బెడదను నియంత్రించేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టడంతో పాటు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై పారదర్శకంగా విచారణ జరిపితేనే ప్రజల్లో నెలకొన్న ఆందోళనకు పరిష్కారం లభించే అవకాశం ఉంది.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!