నాగర్ కర్నూల్.అర్జున్ సమాచారం:
నాగర్ కర్నూల్ జిల్లాలో రూ.1,778 కోట్లకు పైగా వ్యవసాయ రుణాల పునర్వ్యవస్థీకరణకు చర్యలు జిల్లాలో కరువు ప్రభావిత మండలాల వారీగా పంట నష్టాల తీవ్రత గుర్తింపు గ్రామాల వారీగా రుణ పునర్వ్యవస్థీకరణకు అర్హులైన రైతుల గుర్తింపు అర్హులైన రైతులకు బ్యాంకులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం జిల్లాలో కరువు పరిస్థితులపై బ్యాంకు అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.. తీవ్ర కరువు ప్రభావిత మండలాల్లో అర్హులైన రైతులకు 12 నెలల రుణ మారటోరియం తీవ్ర కరువు మండలాల్లో రుణ చెల్లింపు గడువు గరిష్ఠంగా 60 నెలలకు పొడిగింపు, పాక్షిక కరువు మండలాల్లో రుణ చెల్లింపు గడువు 36 నెలల వరకు పొడిగింపు వుంటుందని అన్నారు. .
స్వల్పకాలిక పంట రుణాలను వడ్డీతో సహా మధ్యకాలిక రుణాలుగా మార్చే అవకాశం
వుంటుందని అన్నారు. జిల్లాలో 65,893 మంది రైతులకు రూ.1,125.10 కోట్ల పంట రుణాల మంజూరు, మరో 27,297 మంది రైతులకు రూ.653.41 కోట్ల వ్యవసాయ కాలపరిమితి రుణాలు.
అర్హులైన రైతులందరికీ రుణ పునర్వ్యవస్థీకరణ ప్రయోజనాలు అందించాలని కలెక్టర్ అన్నారు తదుపరి పంటల సాగుకు కొత్త పంట రుణాలు, వర్కింగ్ క్యాపిటల్ రుణాలు సకాలంలో మంజూరు చేయాలి. కరువు ప్రభావిత రైతులపై రుణ వసూళ్ల ఒత్తిడి, బెదిరింపులు చేయరాదు, రైతుల నుంచి బలవంతపు రుణ వసూళ్లు చేపట్టకూడదని బ్యాంకులకు కలెక్టర్ ఆదేశం ఇచ్చారు. రైతు వేదికలు, గ్రామసభల ద్వారా రుణ పునర్వ్యవస్థీకరణపై అవగాహన కల్పించాలి
. వ్యవసాయ శాఖ, బ్యాంకులు సమన్వయంతో గ్రామాల వారీగా అర్హులైన రైతులను గుర్తించాలి
. వచ్చే వారం రోజుల్లో మండల స్థాయిలో బ్యాంకుల సమన్వయ సమావేశాలు నిర్వహించాలి
రుణ పునర్వ్యవస్థీకరణ అమలుపై పురోగతి నివేదికలు సమర్పించాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు..

