అర్జున్ సమాచారం:
నిర్మల్ కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలపై నిప్పులు చెరిగారు. బండి సంజయ్ ప్రసంగిస్తుండగా సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేసారు. సీఎం సీఎం అంటే మైక్ బంద్ చేస్తానంటూ కార్యకర్తలను బండి సంజయ్ మందలించారు.
బండి సంజయ్ మాట్లాడుతూ నిర్మల్ గడ్డ కాషాయ అడ్డా. నిర్మల్ కు వచ్చి ‘సర్’ వద్దంటే వీపంతా సాఫ్ చేయండి. 2004లో మాజీ ప్రధాని పీవీ, ఆ తరువాత ఎమ్మెస్సార్ వంటి నాయకులు చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఓటర్లు గానే ఉన్నారు వాళ్ల ఓట్లు తీసేయాలా వద్దా, చనిపోయిన వారిని ఓట్లను, డూప్లికేట్ ఓట్లను ఇటలీ సంతతి వాళ్లు ప్రధాని కావాలని కలలు కంటున్నారు. కాంగ్రెస్ రాక్షస సేన వాళ్ల నిందలను మోదీ గరళ కంఠుడిగా భరిస్తున్నాడు. రాహుల్ గాంధీ మీ ముత్తాత, నానమ్మ, నాయన హయాంలో సర్ చేపడితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించలేదని అన్నారు.
రాహుల్ గాంధీకి సర్ పై అవగాహన లేనేలేదు. ఈ దేశ పౌరులే ప్రధానిని, ఎంపీ, ఎమ్మెల్యేలను నిర్ణయించారు. బంగ్లాదేశ్, పాక్ లాంటి కోన్ కిస్కా గాళ్లు ప్రధాని, సీఎంను నిర్ణయిస్తామంటే ఊరుకునేది లేదు. అట్లాంటి కౌన్ కిస్కా గాళ్లను ఉరికించి ఉరికించి బట్టలూడదీసి కొడతాం. సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ను తరిమి కొట్టాలి. సర్ కోరుతూ అమిత్ షా పాదయాత్ర చేస్తే లక్షలాది మంది తరలివచ్చి మద్దతు పలికారు. . అమిత్ షాను వందనం చేస్తే నన్ను, రామచంద్రరావు ను బీఆర్ఎస్, కాంగ్రెస్ లుచ్చాగాళ్లు కించపరుస్తూ ట్రోల్ చేస్తున్నారు. మాకు మీలాగా గ్లాసులో మందుపోసే కల్చర్ నేర్పలేదు. డబ్బు సంచులు ఢిల్లీ పెద్దలకు పంపే సంస్క్రుతిని నేర్పలేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలారా మిమ్ముల్ని ఉరికించి కొట్టే రోజులు రాబోతున్నాయి. తెలంగాణ గడ్డపై ఇంకపై రంగు రంగుల జెండాలకు తావు లేదు. ఇకపై ఎగరబోయేది కాషాయ జెండానే. తెలంగాణ ప్రజలంతా కాషాయ జెండానే కోరుకుంటున్నారు. రామచంద్రరావు నాయకత్వంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం. కరెంట్ లేక, నీళ్లు లేక ప్రజలు బాధపడుతున్నరు. పెన్షన్లు రాక వ్రుద్దులు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు, మహిళలుసహా అన్ని వర్గాలు బాదపడుతుతున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలి కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి పోయి సర్ పేరుతో డ్రామాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలారా మీరిట్లనే చేస్తే త్వరలోనే ఎన్ఆర్సీని తీసుకొచ్చి తీరుతామని అన్నారు.

