కమాన్ పూర్. అర్జున్ సమాచారం:
సింగరేణి సంస్థ రామ గౌడ్ ఆర్.జి-2 ఏరియా పరిధిలోని వకీల్ పల్లి గనిని శుక్రవారం ఏరియా జనరల్ మేనేజర్ టి. లక్ష్మీ పతి గౌడ్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గనిలోని సీఎంపీ 5ప్యానల్ ను సందర్శించి, అక్కడ జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి పనులు, భద్రతా చర్యలు, వెంటిలేషన్ సౌకర్యాలను పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
జీఎం వెంట గని ఏజెంట్ నెహ్రూ,గని మేనేజర్ మల్లేశం సేఫ్టీ ఆఫీసర్ రాంకుమార్ , వెంటిలేషన్ ఆఫీసర్ నరేష్ తదితరులుఉన్నారు.ఉత్పత్తి లక్ష్యాలను భద్రతకు ప్రాధాన్యతనిస్తూ సాధించాలని ఈ సందర్భంగా జీఎం అధికారులకు సూచించారు.
=======================

