ePaper
Saturday, November 7, 2026
ePaper
Homeతెలంగాణఅల్లం బుచ్చమ్మకు పలువురు ప్రముఖుల ఘన నివాళి.పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.

అల్లం బుచ్చమ్మకు పలువురు ప్రముఖుల ఘన నివాళి.పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.

📰 Generate e-Paper Clip

అల్లం బుచ్చమ్మకు పలువురు ప్రముఖుల ఘన నివాళి.పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు.

అర్జున్ సమాచారం. నవంబర్ 7.మంథని డెస్కు.

మంథని: అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ కవులు, రచయితలు, జర్నలిస్టుల తల్లి కామ్రేడ్ అల్లం బుచ్చమ్మకు పలువురు ప్రముఖులు శనివారం ఘనంగా నివాళులర్పించారు. మంథని, రామగుండం మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, కోరుకంటి చందర్, ఏపీఎంసీ చైర్మన్ కొత్త శ్రీనివాస్, టీయూఎస్ ఆర్టీసీ రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్, నేత రవి, న్యాయవాది ఇనుముల సతీష్, విరసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకుడు బాలసాని రాజయ్య తదితరులు బుచ్చమ్మ పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని అల్లం సోదరులు రాజయ్య, వీరయ్య, నారాయణలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గత కొంతకాలంగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అల్లం బుచ్చమ్మ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆమె స్వగ్రామమైన మంథని మండలం గాజులపల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ అంత్యక్రియల కార్యక్రమానికి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గంట చక్రపాణి, కల్లుగీత మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కె. శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే హెచ్-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, కోశాధికారి యోగానంద్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నగునూరి శేఖర్, సీనియర్ జర్నలిస్టులు అవ్వారి భాస్కర్, కందుకూరి రమేష్ బాబు, గొర్ల బచ్చన్న, బి.ఆర్. లెనిన్, చెల్మల సుధాకర్, తిరుపతి నాయక్, లాయక్ పాషా, అంకరి ప్రకాష్, ఎలగందుల రవీందర్ తదితరులు హాజరై నివాళులర్పించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!