ePaper
Saturday, November 14, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్100 కోట్ల ఆస్తులు పైనే డిఈఈ

100 కోట్ల ఆస్తులు పైనే డిఈఈ

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, నవంబరు 13,అర్జున్ సమాచారం:
తెలంగాణలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఇరిగేషన్ శాఖ డీఈఈగా పనిచేస్తున్న ఆర్. సత్యనారాయణ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో ఏసీబీ అధికారులు ఏకకాలంలో 10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 25 ఎకరాల వ్యవసాయ భూమి, ఫామ్‌హౌస్‌, విల్లాలు, హైదరాబాద్‌లో ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు, 50 తులాల బంగారం, మూడు కార్లు, బ్యాంకు డిపాజిట్లు బయటపడ్డాయి. మార్కెట్ విలువ రూ.100 కోట్ల వరకు ఉండవచ్చనే అంచనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. డీఈఈని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.తెలంగాణలో అవినీతి అధికారుల గుండెల్లో ఏసీబీ అధికారులు మరోసారి రైళ్లు పరిగెత్తించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పనిచేస్తున్న ఇరిగేషన్ అండ్ సీఏడీ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) ఆర్. సత్యనారాయణ ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. గురువారం ఏకకాలంలో 10 బృందాలతో హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా స్థిర, చరాస్తులు బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.నాగర్‌కర్నూల్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్. సత్యనారాయణ (44)పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన నివాసంతో పాటు బంధువులు, ఇతర సంబంధిత ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని బైరామల్‌గూడ మాధవరం సెరెనిటీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న నివాసంతో పాటు నాగర్‌కర్నూల్‌, వనపర్తి వంటి ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 10 ఏసీబీ బృందాలు పాల్గొన్నాయి. ఏసీబీ తనిఖీల్లో సత్యనారాయణకు సంబంధించిన 25 ఎకరాల వ్యవసాయ భూమి, ఫామ్‌హౌస్‌, విల్లాలు, హైదరాబాద్‌లోని ఫ్లాట్లు, ఓపెన్ ప్లాట్లు వెలుగులోకి వచ్చాయి.వీటితో పాటు సుమారు 50 తులాల బంగారు ఆభరణాలు, 3 కార్లు, బ్యాంకు డిపాజిట్లు, రూ.20 లక్షల నగదు, ఎల్‌ఐసీ పాలసీల వివరాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వ లెక్కల ప్రకారం గుర్తించిన ఆస్తుల విలువ సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. అయితే బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.100 కోట్ల వరకు ఉండవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఆస్తులపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు సత్యనారాయణను అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఏసీబీ డీఎస్పీ చలపతి తెలిపారు.నాగర్‌కర్నూల్‌ ఇరిగేషన్ డీఈఈ సత్యనారాయణ పేరు మీద.. వనపర్తిలో 25 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు.. ఒక ఫామ్‌హౌస్, 9 ఓపెన్ ప్లాట్లు, రూ.కోట్ల విలువైన విల్లాలు.. హైదరాబాద్ కర్మాన్‌ఘాట్‌లో 3బీహెచ్‌కే ఫ్లాట్, నాగోల్‌లో 2బీహెచ్‌కే ఫ్లాట్లు ఉన్నాయని ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. అరకిలో బంగారాన్ని గుర్తించి సీజ్ చేశారు. 3 కార్లతోపాటు.. బ్యాంకు డిపాజిట్లు, ఇతర రూపాల్లో రూ.20 లక్షలు, ఎల్‌ఐసీ పాలసీలు కూడా ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!