ePaper
Wednesday, November 18, 2026
ePaper
Homeజాతియందడ పుట్టిస్తున్న ద్రవ్యోల్బణం,

దడ పుట్టిస్తున్న ద్రవ్యోల్బణం,

📰 Generate e-Paper Clip

దడ పుట్టిస్తున్న ద్రవ్యోల్బణం,

విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 18.

ధరల కట్టడిలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విఫలం కావడంతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దేశంలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మరోసారి పెరిగింది.అక్టోబరులో వార్షిక ప్రాతిపదికన టోకు ద్రవ్యోల్బణం 12.29 శాతానికి చేరింది.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.సెప్టెంబరులో నమోదైన 11.39 శాతంతో పోలిస్తే అక్టోబరులో ద్రవ్యోల్బణం మరింత పెరిగింది. సర్వేలో ఆర్థిక నిపుణులు అంచనా వేసిన 12.1 శాతాన్ని కూడా మించింది.
ప్రధానంగా ఆహార పదార్థాలు, చమురు ధరలు పెరగడం ఈ పరిణామానికి కారణమైంది. అక్టోబరులో టోకు ఆహార ధరలు 8.58 శాతం పెరిగాయి.అయితే సెప్టెంబరులో ఈ పెరుగుదల 8.66 శాతంగా నమోదైంది. అంటే ఆహార ధరల పెరుగుదల రేటులో స్వల్ప తగ్గుదల కనిపించింది.మరోవైపు తయారీ రంగ ఉత్పత్తుల ధరలు అక్టోబరులో 9.54 శాతం పెరిగాయి.సెప్టెంబరులో ఈ పెరుగుదల 9.76 శాతంగా ఉంది. దీంతో తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదలలోనూ కొంత తగ్గుదల నమోదైంది.ఇంధనం, విద్యుత్ ధరల పెరుగుదల మాత్రం మరింత వేగంగా కొనసాగింది.సెప్టెంబరులో 25.85 శాతంగా ఉన్న ఈ విభాగం ద్రవ్యోల్బణం అక్టోబరులో 32.84 శాతానికి చేరింది.అయితే పెట్రోలియం, సహజ వాయువు ధరల పెరుగుదల మాత్రం గణనీయంగా తగ్గింది.సెప్టెంబరులో 57.32 శాతంగా ఉన్న ఈ ధరల పెరుగుదల అక్టోబరులో 7.80 శాతానికి పరిమితమైంది.మొత్తంగా ఆహార పదార్థాలు, ఇంధనం, చమురు ధరల్లో చోటుచేసుకున్న మార్పులు టోకు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపాయి.జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచీ గణాంకాల ప్రకారం, దేశంలో 7 శాతానికి మించి ద్రవ్యోల్బణం నమోదైన ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. గత పది నెలలుగా రాష్ట్రంలో ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే ఎక్కువగా కొనసాగుతోంది. ఇది సామాన్య కుటుంబాల కొనుగోలు శక్తిపై ఒత్తిడి తెస్తోంది.ఈ ఏడాది జనవరిలో తెలంగాణలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.92 శాతంగా ఉండగా, నెలవారీగా పెరుగుతూ అక్టోబర్‌లో 7.26 శాతానికి చేరుకుంది.ఫిబ్రవరిలో 5.02, మార్చిలో 5.83, మేలో 6.15, జూన్‌లో 6.36 శాతంగా నమోదైంది. జూలై, ఆగస్టులో కాస్త తగ్గినప్పటికీ సెప్టెంబర్ నుంచి మళ్లీ పెరుగుదల మొదలైంది. ఇప్పుడు ఏడాది గరిష్ఠ స్థాయికి చేరింది.గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అక్టోబర్‌లో గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 8.05 శాతానికి చేరగా, పట్టణ ప్రాంతాల్లో 6.68 శాతంగా ఉంది. జాతీయ గ్రామీణ సగటు 6.63 శాతంతో పోలిస్తే తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 1.4 శాతం పాయింట్లు అధికం.దీంతో గ్రామీణ కుటుంబాలపై నిత్యావసరాల ధరల భారం మరింత ఎక్కువగా పడుతోంది.ఆహార ధరల పెరుగుదలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో ఆహార ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 7.74 శాతం ఉండగా అక్టోబర్‌లో 8.94 శాతానికి పెరిగింది. ఉల్లి ధరలు 116 శాతం పైగా పెరగడం, వెల్లుల్లి, అల్లం, నిమ్మకాయలు, బియ్యం వంటి వస్తువుల ధరలు ఎగబాకడం సామాన్యుల ఇంటి బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.అక్టోబర్‌లో రాష్ట్రంలో వర్షపాతం భారీగా తగ్గడం, ఎల్‌నినో ప్రభావం వల్ల వ్యవసాయ ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది కూరగాయలు, పండ్లు, ధాన్యాల ధరలపై మరింత ఒత్తిడి తీసుకురావచ్చు.ధరల పెరుగుదల వల్ల మధ్యతరగతి, నిమ్న మధ్యతరగతి కుటుంబాలు రోజువారీ ఖర్చులను తగ్గించుకోవాల్సి వస్తోంది. కూరగాయలు, పప్పులు, నూనె, పాలు వంటి అవసరాలకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడంతో ఇతర అవసరాలు వెనక్కి పోతున్నాయి.ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టినప్పటికీ, సరఫరా గొలుసులోని సమస్యలు, వాతావరణ ప్రభావం కొనసాగితే ముందున్న నెలల్లో కూడా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.మొత్తంగా చూస్తే తెలంగాణలో ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రావాలంటే ఆహార ఉత్పత్తి పెంపు, సరఫరా మెరుగుదల, అవసరమైన చోట సబ్సిడీలు లేదా మార్కెట్ జోక్యం అవసరం. సామాన్యులు కూడా ధరలు తక్కువగా ఉన్న సీజనల్ కూరగాయలు, స్థానిక ఉత్పత్తులు వాడటం ద్వారా కొంతవరకు ఖర్చులను అదుపులో ఉంచుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితి సామాన్యుడి జేబుపై నిజంగా భారం పెడుతోంది.ద్రవ్యోల్బణం కట్టడికి వచ్చే ద్రవ్య సమీక్షల్లో రెపోరేటును ఆర్బీఐ పెంచడం ఖాయంగానే కనిపిస్తున్నది. ఇదే జరిగితే నిర్మాణ, ఆటో రంగాలకు పెద్ద దెబ్బేనన్న విశ్లేషణలుంటున్నాయి. ఇప్పటికే ఇండ్ల విక్రయాలు లేక రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదేలైంది. ఈ క్రమంలో వడ్డీరేట్ల పెంపు గృహ రుణాలపై ప్రభావం చూపనున్నది. ఇప్పటికే లోన్లపై ఇండ్లు కొన్నవారికి ఈఎంఐలు భారంగా మారుతాయని, కొనాలనుకుంటున్నవారు తమ నిర్ణయాలను వాయిదా వేసుకోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అలాగే వాహన, వ్యక్తిగత రుణాలూ ప్రియమవుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాణ, ఆటో వాటి అనుబంధ రంగాలు మందగమనంలోకి జారుకుంటే.. అది దేశ ఆర్థిక వృద్ధిరేటునే కుంగదీస్తుందని మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలే ఎల్‌ నినో దెబ్బకు అన్ని రంగాలు ఢీలాపడ్డ తరుణంలో ద్రవ్యోల్బణం పేరిట ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచితే మరిన్ని రంగాలు నష్టపోతాయని సూచిస్తున్నారు.ఇంధనం, ఆహార ధరల షాక్‌లు రెండూ ఒకేసారి వచ్చినప్పుడు వాటి ప్రభావం మరింత పెద్దదిగా ఉండవచ్చు. అందుకే పరిస్థితుల్ని చక్కదిద్దడానికి ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు అనివార్యంగానే కనిపిస్తున్నది. వచ్చే నెల ద్రవ్య సమీక్షలో రెపోరేటు 50 బేసిస్‌ పాయింట్లు పెరిగే వీలు లేకపోలేదు.ఎల్‌ నినో కారణంగా ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో దేశీయ వ్యవసాయ రంగం దెబ్బ తింటున్నది. పంటల సాగు, దిగుబడి రెండూ పడిపోతున్నాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటంతో వినియోగ సామర్థ్యం తగ్గిపోతున్నది. పె

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!