ePaper
Wednesday, November 18, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్కుల్గాంలో ఎన్‌కౌంటర్,

కుల్గాంలో ఎన్‌కౌంటర్,

📰 Generate e-Paper Clip

కుల్గాంలో ఎన్‌కౌంటర్,

జమ్మూ కాశ్మీర్: అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 18.

ద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య హోరాహోరీ కాల్పులు ,లష్కరే కమాండర్ లతీఫ్ భట్ కోసం కొనసాగుతున్న గాలింపు,సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో లతీఫ్ సహచరుడు హతం,
నవంబర్ 11న సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి కేసులో వీరి ప్రమేయ.
 జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాల సంయుక్త బృందం ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయాన్ని కశ్మీర్ జోన్ పోలీసులు ‘ఎక్స్’ వేదికగా ధ్రువీకరించారు. సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్ కోసం భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తుండగా ఈ తాజా ఘటన జరిగింది. సోమవారం నాటి ఆపరేషన్‌లో లతీఫ్ సహచరుడైన ఉమర్ నిసార్ దార్ హతమయ్యాడు. నవంబర్ 11న కుల్గాంలోని అఖ్రాన్‌లో సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన దాడిలో లతీఫ్, ఉమర్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. దాడికి ముందు రోజు, నవంబర్ 10న వీరిద్దరూ పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. బేకరీలో పనిచేసే ఉమర్, గత ఐదారు నెలలుగా లతీఫ్ భట్‌కు ఆశ్రయం కల్పిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దాడి అనంతరం ఉమర్, లష్కరే అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్)లో చేరినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం ఉమర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన లతీఫ్ కోసం గాలింపును తీవ్రతరం చేశాయి. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఉగ్రవాదులు తారసపడటంతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. డీజీపీ, ఐజీపీ వంటి ఉన్నతాధికారులు ఈ ఆపరేషన్‌ను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!