ePaper
Friday, November 20, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడి మృతి.. కుటుంబానికి అండగా రోటిగుడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి....

రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడి మృతి.. కుటుంబానికి అండగా రోటిగుడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి….

📰 Generate e-Paper Clip

రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడి మృతి.. కుటుంబానికి అండగా రోటిగుడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి….

నాగేష్ కుటుంబానికి ₹72,675 ఆర్థిక సహాయం … గల్ఫ్ రిటర్న్ కార్మికుల కుటుంబాలకు ₹5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్…

జన్నారం ప్రతినిధి : అర్జున్ సమాచారం నవంబర్ 20:

అక్టోబర్ 1న జన్నారం జింకల పార్కు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పురంశెట్టి నాగేష్ కుటుంబానికి రోటిగుడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అండగా నిలిచింది. సమితి అధ్యక్షులు ఉప్పు తిరుపతి ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. గల్ఫ్ కార్మికుడిగా జీవనం సాగించిన నాగేష్, ప్రస్తుతం స్వగ్రామంలో మేస్త్రీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోవడంతో భార్యాపిల్లలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందుల్లో పడిన పరిస్థితి ఏర్పడింది. నాగేష్ రోటిగుడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితిలో సభ్యుడిగా ఉన్నందున, సమితి నిబంధనల ప్రకారం సభ్యుని కుటుంబానికి అందించే తక్షణ సహాయంగా అతను మరణించిన మరుసటి రోజే ₹10,000 ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. అంతటితో ఆగకుండా, నాగేష్ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ కుటుంబానికి మరింత ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో సమితి సభ్యుల నుంచి విరాళాలు సేకరించింది. సభ్యుల సహృదయత, ఐక్యత, మానవత్వంతో సేకరించిన మొత్తం ₹72,675 ఆర్థిక సహాయాన్ని ఈరోజు కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా కమిటీ మాజీ అధ్యక్షులు ఉప్పు సురేష్ మాట్లాడుతూ, గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందిస్తున్న విధంగానే, గల్ఫ్‌లో పనిచేసి స్వదేశానికి తిరిగి వచ్చిన కార్మికులు స్వగ్రామాల్లో మరణించినా వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గల్ఫ్ రిటర్న్ కార్మికుడు మరణించిన సందర్భంలో బాధిత కుటుంబానికి ₹5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విదేశాల్లో కష్టపడి కుటుంబాల కోసం పనిచేసిన కార్మికుల సేవలను గుర్తించి, వారు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా వారి కుటుంబాలకు ప్రభుత్వ పరంగా తగిన రక్షణ, ఆర్థిక సహాయం అందించాలని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమానికి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికీ, సహకరించిన సభ్యులందరికీ రోటిగుడ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో సమితి కార్యవర్గ సభ్యులు ఉప్పు సురేష్, ఉప్పు రాజారెడ్డి, ఓడ్డెటి రమేష్, అలాగే సభ్యులు ఉప్పు రామన్న, సేపూరి సత్తిష్, కుంట భూమేష్, పులిశెట్టి భూమరెడ్డి, పులిశెట్టి భగత్, కుంట రమేష్, పురంశెట్టి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!