ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కరించాలి.
కలెక్టర్ కుమార్ దీపక్‌కు వినతిపత్రం అందజేసిన టీఎన్జీవో నాయకులు.
అర్జున్ సమాచారం. నవంబర్ 20, మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వసతి గృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న నిత్యావసర సరుకుల సరఫరాలో నెలకొన్న సమస్యలతో పాటు ఇతర ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వసతి గృహాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను వివరించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సరుకులు సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని కోరారు.
వసతి గృహాల్లోని సమస్యల పరిష్కారంతో పాటు విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సంబంధిత అధికారులు దృష్టి సారించాలని టీఎన్జీవో నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మోసిన్, కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

