మంచిర్యాలలో 30 మంది ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వం స్వీకరణ….
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాం – టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి.
మంచిర్యాల:అర్జున్ సమాచారం, నవంబర్ 21 .
మంచిర్యాల: ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీఎన్జీవో సంఘం నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అన్నారు. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా ట్రెజరీ కార్యాలయం, జిల్లా పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో పనిచేస్తున్న 30 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు సంఘంలో సభ్యత్వం స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ.. ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, హక్కుల సాధన కోసం సంఘం నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను సంఘంలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.
జిల్లాలో ఇంకా సభ్యత్వ నమోదు పూర్తి కావాల్సిన మిగిలిన యూనిట్లలో కూడా త్వరలోనే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంచిర్యాల జిల్లా సభ్యత్వ నమోదులో మొదటి స్థానంలో నిలిచేలా నాయకులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఉద్యోగ సంఘాల కార్యకలాపాలు, ఐక్యత, సమస్యల పరిష్కారంలో మంచిర్యాల జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షులు రాంకుమార్, తిరుపతి, సంయుక్త కార్యదర్శి సునీత, ప్రచార కార్యదర్శి యూసుఫ్, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్‌తో పాటు ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.

