అర్జున్ సమాచారం:
హైదరాబాద్:
హైదరాబాద్ క్యూర్ పరిధిలో 9 హోటళ్లు, రెస్టారెంట్లలో టీజీ సేఫ్ అధికారులు తనిఖీలు జరిపారు. వినియోగదారుల ఫిర్యాదులతో 8 ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సుమారు 135 కిలోల ఆహార పదార్థాలు సీజ్ చేసారు. మరికొన్ని పారవేసారు. అనుమానంతో ఎనిమిది ఆహార నమూనాలు సేకరించారు. ఫుడ్ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న రెండు సంస్థలను మూసివేసారు. నిబంధనల ఉల్లంఘనలతో మరో 4 సంస్థల లైసెన్సులు సస్పెండ్ చేసారు. మాధాపూర్ బావర్చి, ది స్పైస్ కిచెన్, మాతమ్ అల్ యమానీ, అన్నపూర్ణ క్యాటరర్స్ లైసెన్సులు సస్పెండ్ చేసారు. సస్పెండ్ చేసిన సంస్థలను స్విగ్గీ, జొమాటో నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసారు. హోటళ్లలో బొద్దింకలు, ఈగలు, ఎలుకల వ్యర్థాలు.. అపరిశుభ్ర వంటశాలలు గుర్తించారు.
వెజ్, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను కలిపి నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్ రికార్డులు, సిబ్బంది వైద్య పరీక్షలు, వాటర్ టెస్టింగ్ రిపోర్టులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. మెహఫిల్ రెస్టారెంట్‌కు లోపాల సవరణ నోటీసు జారీ చేసారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. జరిమానాలు విధించేందుకు చర్యలు తీసుకున్నారు…..
పలు హోటళ్లలో తనిఖీలు.. 135 కిలోల ఆహార పదార్ధాలు సీజ్
RELATED ARTICLES

