ePaper
Sunday, November 22, 2026
ePaper
Homeతెలంగాణశాంత్రాజ్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.

శాంత్రాజ్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.

📰 Generate e-Paper Clip

శాంత్రాజ్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.

అర్జున్ సమాచారం. నవంబర్ 22,ముత్తారం రిపోర్ట్ .

నలుగురు నిరుపేద కుటుంబాలకు ముగ్గు పోసిన సర్పంచ్ చొప్పరి సంపత్.

ముత్తారం: పారుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మానేరు వాగు ఒడ్డున ఉన్న మారుమూల ప్రాంతం శాంత్రాజ్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ చొప్పరి సంపత్ ఆధ్వర్యంలో నలుగురు నిరుపేద కుటుంబాలకు నూతన ఇళ్ల నిర్మాణం కోసం ముగ్గు పోసే కార్యక్రమం నిర్వహించారు.

శాంత్రాజ్‌పల్లిలో సుమారు 30 కుటుంబాలు గత కొన్ని సంవత్సరాలుగా పూరి గుడిసెల్లో నివసిస్తూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న నిర్మాణ ఖర్చుల కారణంగా పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చుకోవడం భారంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు ఎంతో ప్రయోజనకరంగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చొప్పరి సంపత్ మాట్లాడుతూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారం, మార్గదర్శకత్వంతో గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. శాంత్రాజ్‌పల్లిలో ఇంకా ఇళ్లు లేని నిరుపేద కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, వారి సొంతింటి కలను సాకారం చేయాలని గ్రామ ప్రజలు మంత్రి శ్రీధర్ బాబును కోరుతున్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బోడ శ్యామల బాపు, యూత్ అధ్యక్షుడు కారుపాకల శ్రీకాంత్, వార్డు సభ్యులు ముంజం అంజి, గట్టయ్య, రమేష్, రాజయ్య, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!