ePaper
Sunday, November 22, 2026
ePaper
Homeతెలంగాణపలు వివాహ వేడుకల్లో పాల్గొన్న రత్నాపూర్ సర్పంచ్....

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న రత్నాపూర్ సర్పంచ్….

📰 Generate e-Paper Clip

పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న రత్నాపూర్ సర్పంచ్….

అర్జున్ సమాచారం .నవంబర్ 22.రామగిరి రిపోర్టర్…

రామగిరి. మండలం రత్నాపూర్ గ్రామ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు ఆదివారం మండలంతో పాటు పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన పలు వివాహ, శుభకార్య వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను, కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.

ఆర్జీ-3 డివిజన్ ఫారెస్ట్ అసిస్టెంట్ రాపోలు నాగేశ్వరరావు (నగేష్) సోదరి కీర్తిక, ఐదే హరీష్ రావు వివాహం గోదావరిఖనిలోని బృందావన్ గార్డెన్‌లో జరగగా, వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అదేవిధంగా రత్నాపూర్ రాంనగర్‌కు చెందిన నూనె మంగా-రాజేశం కుమారుడు శ్రీకాంత్, హరిప్రియ వివాహం పెద్దపల్లి హనుమంతునిపేటలోని బృందావన్ గార్డెన్‌లో జరగగా, వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

రత్నాపూర్ రాంనగర్‌కు చెందిన బాలసాని వసంత-లక్ష్మణ్ గౌడ్ మనుమడు దేవరాజ్ గౌడ్-ప్రియాంకల కుమారుడు శ్రియాన్స్ గౌడ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. అలాగే రత్నాపూర్ ఎంపీటీసీ మద్దెల ఓదెల-సునీత కుమార్తె నిశ్చితార్థ వేడుక పన్నూరులోని సత్య గార్డెన్‌లో జరగగా, కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు భోగే సతీష్, తుల సంపత్, పల్లె తిరుమలరావు, ముడుసు నరసయ్య, మద్దెల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!