ePaper
Sunday, November 22, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం.. వ్యవసాయ బావిలో వెలికితీత.

అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం.. వ్యవసాయ బావిలో వెలికితీత.

📰 Generate e-Paper Clip

అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం.. వ్యవసాయ బావిలో వెలికితీత.

ఇద్దరు వ్యక్తుల వేధింపులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడి..

బీమారము:అర్జున్ సమాచారం ప్రతినిధి .నవంబర్ 22 .

భీమారం (మంచిర్యాల జిల్లా): భీమారం గ్రామానికి చెందిన సుందిల్ల ఎల్లయ్య (60), తండ్రి బాణయ్య అదృశ్యమైన ఘటన విషాదాంతంగా ముగిసింది. గ్రామ పరిధిలోని ఓ వ్యవసాయ బావిలో ఆదివారం ఉదయం ఆయన మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 20వ తేదీ నుంచి ఎల్లయ్య కనిపించకపోవడంతో ఆయన బంధువు సుందిల్ల మల్లేష్ భీమారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆదివారం (నవంబర్ 22) ఉదయం సుమారు 6 గంటల సమయంలో గ్రామ పరిధిలోని వ్యవసాయ బావిలో ఎల్లయ్య మృతదేహాన్ని గుర్తించారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మూడు రోజుల క్రితం నిట్టూరి మహేష్, జలంపెల్లి రాజయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఎల్లయ్యను కొట్టి, దూషించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎల్లయ్య ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి నిందితులుగా పేర్కొన్న ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించినట్లు భీమారం ఎస్సై ఏ. రాజేందర్ వెల్లడించారు. ఘటనకు సంబంధించిన తదుపరి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!