ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో టీఎన్జీవో సభ్యత్వ నమోదు,
15 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగుల చేరిక.. రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యం: జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి…
అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 23.
మంచిర్యాల: టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల మంచిర్యాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాలలో పనిచేస్తున్న 15 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సంఘంలో సభ్యత్వం స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎన్జీవో సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సంఘం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లాలోని మిగిలిన అన్ని యూనిట్లలోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాను సభ్యత్వ నమోదులో ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. సంఘటితంగా పనిచేస్తూ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు రాష్ట్రానికే మంచిర్యాల జిల్లాను ఆదర్శంగా నిలపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఉపాధ్యక్షురాలు పద్మలత, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్‌తో పాటు మెడికల్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

