ePaper
Wednesday, November 25, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వరుస ప్రమాదాలు.. తాజాగా దంపతులు మృతి.

ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వరుస ప్రమాదాలు.. తాజాగా దంపతులు మృతి.

📰 Generate e-Paper Clip

ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వరుస ప్రమాదాలు.. తాజాగా దంపతులు మృతి.

కారేపల్లి, నవంబర్ 24: అర్జున్ సమాచారం డెస్క్.

ప్రయాణ సమయాన్ని తగ్గించి రాకపోకలను సులభతరం చేయాల్సిన ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారికంగా ప్రారంభించకముందే వాహనాల రాకపోకలకు అనుమతించడంతో నిత్యం వేలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. అయితే వరుస ప్రమాదాలు, ప్రాణనష్ట ఘటనలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా వైరా మండల పరిధిలోని హైవే ఎగ్జిట్ వద్ద కారు–లారీ ఢీకొన్న ఘటనలో దంపతులు మృతి చెందగా, వారి కుమారుడు గాయపడ్డాడు. అన్నవరం నుంచి తిరిగి వస్తుండగా విషాదం
హైదరాబాద్‌కు చెందిన కోట కిషోర్‌రెడ్డి, ఆయన భార్య లావణ్య, కుమారుడు ప్రణీత్ అన్నవరం దేవస్థానంలో దర్శనం ముగించుకుని తిరిగి వెళ్తుండగా మ‌గ‌ళ‌వారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. వైరా మండల పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద వారి కారు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కిషోర్‌రెడ్డి, లావణ్య అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ప్రణీత్‌ను చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అత్యాధునిక రహదారిపై ప్రమాదాలెందుకు?: ఖమ్మం జిల్లా తల్లంపాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు సుమారు 162 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించారు. వాహనాల వేగ పరిమితి కార్లకు గంటకు 100 కిలోమీటర్లు, భారీ వాహనాలకు 80 కిలోమీటర్లుగా నిర్ణయించారు. ప్రతి కిలోమీటరుకు సీసీటీవీ కెమెరాలు, ఇంటర్‌ఛేంజ్‌లు, ట్రక్ లే-బైలు, ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ వసూలు చేసే విధానం వంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ప్రమాదాలు తరచూ జరుగుతుండటంతో రహదారి భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హైవే ఎగ్జిట్‌లు, ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. వేగ నియంత్రణ, హెచ్చరిక బోర్డులు, రాత్రివేళ తగిన వెలుతురు, సీసీటీవీ పర్యవేక్షణతో పాటు అత్యవసర వైద్య సేవలను అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రహదారిపై ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు వాహనదారుల ప్రాణాలకు భరోసా ఇచ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!