అర్జున్ సమాచారం:
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్వహించిన ‘3వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాడ్మింటన్ మరియు టేబుల్ టెన్నిస్ క్లస్టర్ – 2026’ (All
India Police Meet) క్రీడా పోటీలలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న నలుగురు అధికారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొత్తం ఆరు
పతకాలను (1 స్వర్ణ పతకం, 5 కాంస్య పతకాలు) కైవసం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పతక విజేతలు నేడు (27.11.2026) హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ డా. మహేశ్ మురలీధర్ భగవత్, మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయి క్రీడా పోటీలలో పతకాలు
సాధించి హైదరాబాద్ నగర పోలీసు విభాగానికి గౌరవం తీసుకువచ్చిన అధికారులను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.
పతకాలు సాధించిన అధికారుల వివరాలు:
లతీఫా ఆషా (పెద్దపల్లి జిల్లా; ప్రస్తుతం CP హైదరాబాద్ కార్యాలయంలో విధులు): ఓపెన్ ఉమెన్స్ డబుల్స్ (Open Women’s Doubles) విభాగంలో ఒక స్వర్ణ పతకం (Gold
Medal) మరియు ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ (Open Women’s Singles) విభాగంలో ఒక కాంస్య పతకం (Bronze Medal).
జి. శ్రీను, డి.ఎస్.పి (CSW, హైదరాబాద్): 50+ జీ.ఓ.ఎస్. సింగిల్స్ (50+ GOs Singles) విభాగంలో ఒక కాంస్య పతకం (Bronze Medal).
. ధనలక్ష్మి, ఏ.సి.పి (ట్రాఫిక్, హైదరాబాద్): 45+ మిక్స్‌డ్ డబుల్స్ (45+ Mixed Doubles) మరియు 18+ ఉమెన్ టేబుల్ టెన్నిస్ డబుల్స్ (18+ Women TT
Doubles) విభాగాలలో రెండు కాంస్య పతకాలు (Bronze Medals).
డి. ప్రసన్న లక్ష్మి, డి.ఎస్.పి (CAR హెడ్ క్వార్టర్స్, హైదరాబాద్): 18+ ఉమెన్ టేబుల్ టెన్నిస్ డబుల్స్ (18+ Women TT Doubles) విభాగంలో ఒక కాంస్య పతకం (Bronze
Medal).
విధుల నిర్వహణతో పాటు క్రీడలలోనూ రాణిస్తూ ఇతర పోలీసు సిబ్బందికి వీరు ఆదర్శంగా నిలిచారని పోలీసు కమిషనర్ ఈ సందర్భంగా కొనియాడారు.
=========================

