ePaper
Wednesday, July 8, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్డైలీ షటిల్స్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

డైలీ షటిల్స్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ఐటీ ఉద్యోగుల కోసం జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్లో “డైలీ షటిల్స్” సేవలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్, మరియు నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రజా రవాణాను బలోపేతం చేస్తోందన్నారు. ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, డైలీ షటిల్స్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుదల, కొత్త ఆర్టీసీ బస్సులు, రోడ్డు భద్రత కోసం రిఫ్లెక్టర్ వ్యవస్థ వంటి సంస్కరణలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
=====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!