ePaper
Monday, August 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్క్యూ లైన్ల ఆకస్మిక తనిఖీ శ్రీశైలం

క్యూ లైన్ల ఆకస్మిక తనిఖీ శ్రీశైలం

📰 Generate e-Paper Clip

శ్రీశైలం,అర్జున్ సమాచారం:
శ్రీశైల ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు  పోతుగుంట రమేష్ నాయుడు మంగళవారం క్యూలైన్లు, విరాళాల కేంద్రాన్ని ఆకస్మికoగా తనిఖీ చేశారు. ఆయా దర్శనo టికెట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ భక్తులకు సౌకర్యవoతమైన దర్శనం కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
క్యూ లైన్లలో ఎటువంటి తొక్కిసలాట జరుగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. సంబంధిత సిబ్బంది ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ దర్శనం క్యూలైన్లను నిర్వహిస్తుండాలన్నారు. అధికారులు పరస్పర సమన్వయముతో విధులు నిర్వర్తించాలన్నారు.
భక్తుల రద్దీ సమయంలో ముఖ్యంగా వారాంతపు సెలవులు పర్వదినాలలో క్యూ లైన్ల నిర్వహణ పట్ల మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు క్యూ లైన్లలో నిరంతరం మంచినీరు, అల్పాహారo అందిస్తుండాలని అధికారుకు సూచించారు. దర్శనము వేళలు, దర్శనాలకు పట్టే సమయం మొదలైన అంశాలను నిరంతరం ఆలయ ప్రసార వ్యవస్థ ద్వారా ప్రసారం చేస్తుండాలన్నారు.  క్యూ లైన్లు, క్యూకాంప్లెక్స్ లో లైట్లు, ఫాన్లు, సజావుగా పనిచేసే విధంగా సంబంధించిన సిబ్బంది పర్యవేక్షిస్తుండాలన్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ వైరింగులకు ఎప్పటికప్పుడు అవసరమైన తగు మరమత్తులు చేస్తుoడాలన్నారు.
అయన  భక్తులతో నేరుగా మాట్లాడారు.  దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను గురించి భక్తుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా దర్శనము ఏర్పాట్లు, మంచినీటి సరఫరా, ప్రసాద వితరణ , పారిశుద్ధ్యనిర్వహణ గురించి భక్తులతో మాట్లాడారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!