ePaper
Thursday, August 20, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్మైనర్ బాలిక పై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో 5 గురుకి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి...

మైనర్ బాలిక పై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో 5 గురుకి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ 20,000/- జరిమాన.

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం,జులై 15:
జగిత్యాల ::
 – – మైనర్ బాలికకు 12,00,000/- (12 లక్షల) రూపాయలు పరిహారం….
– – – కీలక తీర్పును వెలువరించిన శ్రీమతి రత్న పద్మావతి
 మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా పోలీస్ లను సంప్రదించండి:జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్…
మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన మైనర్ బాలిక ను 2020 అక్టోబర్ లో నిందితులు A1:లోకిని రాజేష్, వయస్సు 22 సంవత్సరాలు, A2: దారంగుల సాయి కుమార్ వయస్సు 21 సంవత్సరాలు, A3: మొగిలిపాక అనిల్ కుమార్, వయస్సు 19 సంవత్సరాలు, A4: కుంచెపు శివ వయస్సు 19 సంవత్సరాలు, A5: కుంచెపు వెంకటేష్, వయస్సు 22 సంవత్సరాలు అనే 5 గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో నిందితులపై ఐపీసి చట్టం కింద మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ సదాకర్ కేసు నమోదు చేయగా డిఎస్పి లు గౌస్ బాబా, రవీంధ్ర రెడ్డి కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి, నిందితుల పై పటిష్టమైన ఆధారాలతో ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణారావు సమర్థవంతంగా వాదనలు వినిపించగా, కోర్టు డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టారు. కేసులోని ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీమతి రత్న పద్మావతి గారు 5 గురు నిందితులను దోషులుగా తేల్చి అందరికీ జీవిత జీవిత ఖైదు తో పాటు , ఒక్కరికీ రూ 20,000/- జరిమానా , మైనర్ బాలికకు 12,00,000
(12 లక్షల)/- రూపాయలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.
ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ …
మహిళల భద్రతకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మహిళలు మరియు విద్యార్థినులు తమపై జరిగే వేధింపులు, అన్యాయాల గురించి నిర్భయంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ వేగవంతగా జరిపి ఖచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు. పై కేస్ లో నిందితులకి శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!