కరీంనగర్,అర్జున్ సమాచారం:
శాతవాహన విశ్వవిద్యాలయ ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “ఆర్థిక శాస్త్రంలో కంప్యూటర్ అనువర్తనాలు: విద్యార్థులకు డిజిటల్ నైపుణ్యాలు” అనే అంశంపై మంగళవారం ఆర్ట్స్ కళాశాలలో ఒకరోజు కార్యశాల విద్యా సాధికారత కార్యక్రమంలో భాగంగా అధ్యక్షత వహించిన ఆర్ట్స్, లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్. కే. పద్మావతి మాట్లాడుతూ వివిధ రకాల నైపుణ్యాల ప్రయోగాల ద్వారా పరిణితి సాధించాలని పేర్కొన్నారు.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య . యు. ఉమేష్ కుమార్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో డిజిటల్ నైపుణ్యాలు ప్రతి విద్యార్థికి అత్యంత అవసరమని, తద్వారా ఉన్నత విద్య, మెరుగైన ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయ రిజిస్టార్ ఆచార్య పి. సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆర్థిక శాస్త్ర విద్యార్థులకు ఆధునిక డిజిటల్ సాంకేతికతలను పరిచయం చేయడం ద్వారా పరిశోధన, డేటా విశ్లేషణలో ఎక్సెల్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి ఉత్తమ ఫలితాలను రాబట్టవచ్చని విశ్లేషించారు.
కార్యశాల కన్వీనర్ డాక్టర్. కే. శ్రీవాణి మాట్లాడుతూ ప్రైవేటీకరణ,ప్రపంచీకరణలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులు భవిష్యత్తులో ఆర్థిక శాస్త్రంలో కంప్యూటర్ అనువర్తనాలను ఉపయోగించి పరిశోధనలలో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని వివరించారు.
నాలుగు అంశాలపై ఏర్పాటు చేసిన కార్య శాలలో విద్యార్థులకు ఎంఎస్ ఆఫీసు, డేటా విశ్లేషణ, గ్రాఫ్‌లు, చార్టుల తయారీ, ఆర్థిక గణాంకాల ప్రాథమిక విశ్లేషణ, ఇంటర్నెట్ ఆధారిత నైపుణ్యాలు కృత్రిమ మేధస్సు వినియోగం మొదలగు డిజిటల్ సాధనాల వినియోగం గురించి రిసోర్స్ పర్సన్స్ ఆచార్య .జి. రామకృష్ణ, ఆచార్య . ఎం. వరప్రసాద్, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్, డాక్టర్. కే. శ్రీవాణి ,అర్థశాస్త్ర విభాగపు అధిపతి, వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించి ప్రాక్టీస్ చేయించారు.
ఈ కార్యక్రమంలో విసి ఓ ఎస్ డి డాక్టర్. డి.హరికాంత్, కోఆర్డినేటర్ అకాడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం డాక్టర్. ఎన్. వి. శ్రీరంగ ప్రసాద్, ఆర్ట్స్ అండ్ లా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అబ్రర్ ఉల్ బాకీ, కార్యశాల కో కన్వీనర్ డాక్టర్. డి. సత్యనారాయణ, డాక్టర్ .కే. విద్యాసాగర్
విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
కార్యక్రమం ముగింపులో వర్క్ షాప్ లో పాల్గొన్న విద్యార్థులకు ధృవపత్రాలు అందజేశారు.
============================

