ePaper
Friday, August 14, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్మూడేళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టుకు కూడా అనుమతి తీసుకురాలేదు హరీష్ రావు

మూడేళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టుకు కూడా అనుమతి తీసుకురాలేదు హరీష్ రావు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.
ఈనెల 18న హైదరాబాద్ వేదికగా జీఆర్ఎంబీ (GRMB) సమావేశం జరగబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెరో ఎజెండాను సిద్ధం చేసుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మౌనం చూస్తుంటే… జీఆర్ఎంబీ సమావేశం కేవలం ఏపీ ప్రయోజనాల కోసమే జరుగుతోందా? అనే అనుమానం కలుగుతోంది. ఎజెండా వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా తెలంగాణ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని అన్నారు.
ఏపీ ప్రతిపాదించిన అంశాలు చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ప్రతి ఒక్కరి కడుపు మండక మానదు. రక్తం మరిగిపోక తప్పదు.  తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్రలను పటాపంచలు చేయాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా? లేక తెలంగాణ నీటి ప్రయోజనాలను గంపగుత్తగా ఏపీకి తాకట్టు పెట్టాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు.
చంద్రబాబు తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తుంటే… రేవంత్ రెడ్డి రక్తం ఎందుకు మరిగడం లేదు? తెలంగాణ సోయి లేదా? తెలంగాణ ఆత్మగౌరవం లేదా? గురుదక్షిణ కోసమేనా ఈ మౌనం?
ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాట్లాడే రేవంత్ రెడ్డి… పక్క రాష్ట్రం తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదు?  “గుడ్లు పీకుతా… పేగులు మెడలో వేసుకుంటా” అంటూ రాక్షస భాష మాట్లాడే రేవంత్ రెడ్డి… చంద్రబాబు విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు? చంద్రబాబు అంటే అంత భయమా అని నిలదీసారు.
తెలంగాణ జల ప్రయోజనాలను శాశ్వతంగా సమాధి చేసే విధంగా పక్క రాష్ట్రం కుట్రలు చేస్తోంది. ఈనెల 18న జరిగే జీఆర్ఎంబీ సమావేశం ఎజెండా చూస్తే ఏపీ ఎంత వితండవాదం చేస్తుందో స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ మొత్తం విషం చిమ్మింది. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని పదేపదే చెబుతారు. కానీ జీఆర్ఎంబీ ముందు పెట్టిన ఎజెండా చూస్తే అసలు నిజం ఏంటో అర్థమవుతుంది. కాళేశ్వరం, చౌటుపల్లి హన్మంతరావు, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, కడెం గూడెం లిఫ్ట్, సీతారామ లిఫ్ట్ వంటి ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులను నిలిపివేయాలని, వాటిని పునఃసమీక్షించాలని ఏపీ కోరుతోంది. సమ్మక్క బ్యారేజీకి సంబంధించిన క్లియరెన్సులను కూడా నిలిపివేయాలని ఏపీ ప్రతిపాదిస్తోంది.
కొత్తగా అనుమతులు ఇవ్వాలని కాదు… కేసీఆర్ ప్రభుత్వం సాధించిన ఈ ఏడు ప్రాజెక్టుల అనుమతులను రివ్యూ చేయాలని ఏపీ కోరుతోంది.   ప్రతిపాదనను జీఆర్ఎంబీ ఎజెండాలో చేర్చడం అత్యంత దుర్మార్గమైన విషయం. ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయంటే… కేసీఆర్ ప్రభుత్వం సాధించిన అనుమతుల వల్లే. ఇప్పుడు అదే సీతారామ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేయాలని ఏపీ కోరుతోంది. తెలంగాణకు చెందిన ఏడు కీలక ప్రాజెక్టుల అనుమతులను నిలిపివేయాలని ఏపీ ప్రతిపాదిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది? తెలంగాణ ఇంజినీర్లు ఏం చేస్తున్నారు?  ఇప్పటికే అనుమతులు సాధించిన ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసే అధికారం ఎవరు ఇచ్చారు? తెలంగాణ కోసం ఉద్యమం చేసి, పోరాడి కేసీఆర్ ప్రభుత్వం 383 టీఎంసీల గోదావరి జలాలకు అనుమతులు సాధించింది. ఇప్పుడు ఆ అనుమతులను రద్దు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు మూడేళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టుకు కూడా అనుమతి తీసుకురాలేదని మండిపడ్డారు.
============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!