ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeతెలంగాణమారం జగదీశ్వర్‌కు టీఎన్జీవో జిల్లా శాఖ శుభాకాంక్షలు..

మారం జగదీశ్వర్‌కు టీఎన్జీవో జిల్లా శాఖ శుభాకాంక్షలు..

📰 Generate e-Paper Clip

ఉద్యోగుల హక్కుల కోసం నిరంతర పోరాట యోధుడికి ఘన జన్మదిన వేడుకలు.

మారం జగదీశ్వర్‌కు టీఎన్జీవో జిల్లా శాఖ శుభాకాంక్షలు..

అర్జున్ సమాచారం జులై 06 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:

మంచిర్యాల, ఆగస్టు 06: టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య వేదిక అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నాంపల్లి టీఎన్జీవో భవన్‌లో, మంచిర్యాలలోని జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.
మంచిర్యాలలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ మారం జగదీశ్వర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శ్రీ మారం జగదీశ్వర్ నిరంతరం కృషి చేస్తున్న నాయకుడని కొనియాడారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఆయన అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో ఉద్యోగుల హక్కుల సాధన కోసం ముందుండి నడిపించాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ టీఎన్జీవో మంచిర్యాల జిల్లా శాఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, సహ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, తిరుపతి, రాంకుమార్, సత్యనారాయణ, నరేందర్, కేజియా రాణి, సంయుక్త కార్యదర్శులు సునీత, ప్రభు, నిర్వహణ కార్యదర్శి మోసిన్, మంచిర్యాల శాఖ అధ్యక్షులు నాగుల గోపాల్, కార్యదర్శి అజయ్, ఉపాధ్యక్షులు ప్రకాష్, మందమర్రి శాఖ అధ్యక్షులు సుమన్, బెల్లంపల్లి శాఖ అధ్యక్షులు వెంకటేష్, ఇతర నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!