హైదరాబాద్,అర్జున్ సమాచారం:
పక్క రాష్ట్రం కర్ణాటకలో మాజీ సీఎం సిద్ధరామయ్య సతీమణికి.. అక్కడి ప్రభుత్వం మూడెకరాల భూమి కేటాయించిందని బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆ వ్యవహారంలో లోకాయుక్త తీర్పు ఇచ్చింది. చివరికి సిద్దరామయ్య రాజీనామా చేసేదాకా వచ్చిందని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
తెలంగాణలో టెసరాక్ట్ అనే కంపెనీకి అప్పనంగా భూమి కేటాయించారు. టెసరాక్ట్ కంపెనీకి రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్. ఆ విషయాన్ని కొండల్ రెడ్డే లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నారు. టెసరాక్ట్ కంపెనీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పరికరాలను తయారు చేస్తుందట. అమెరికా ఎంబసీ ప్రతినిధితో హైదరాబాద్లో మీటింగ్ కూడా పెట్టారు. యూఎస్ ఇండియా స్ట్రాటెజిక్ డెవలప్ మెంట్ ఫోరంలో.. ఎగ్జిక్యూటివ్ బోర్డులో కొండల్ రెడ్డికి సభ్యత్వం ఇచ్చారని అన్నారు.
కొండల్ రెడ్డి ఏం చదివారో నాకు తెలియదు. టెసరాక్ట్ కంపెనీకి కొండల్ రెడ్డి చైర్మన్ అని అమెరికా కాన్సులేట్ కూడా స్టేట్ మెంట్ ఇచ్చింది.చదువురాని రేవంత్ బ్రదర్స్ అందరూ సూట్లు కోట్లు వేసుకుని చైర్మన్లు అయిపోతున్నరు. టెసరాక్ట్ కంపెనీ కథ ఏంటని మేం ఆరా తీశాం. ఆ కంపెనీ ఫోన్ నంబర్ 123456789 అట. ఇలాంటి నంబర్లు ఉంటాయని మాకు తెల్వదు. రేవంత్ ఏదైనా కొత్త టెక్నాలజీ కనిపెట్టిండేమో? విచిత్రం ఏంటంటే టెసరాక్ట్ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేడు. 2025 మార్చి 31 నాడు వాళ్లే ప్రకటన చేశారు. తమ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేడని చెప్పారు. ఊరూ పేరు లేని చోట ఆ కంపెనీ అడ్రస్ ఉంది. టెసరాక్ట్ మూలధనం లక్ష రూపాయలు. ఈ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన భూమి కట్టబెట్టింది. ఈ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన భూమి కట్టబెట్టింది. ఐదెకరాల భూమిని కేటాయించి, అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. ఇది అనుముల కొండల్ రెడ్డి వ్యవహారం. అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్కు ఇంకో తమ్ముడు ఉన్నాడు. జగదీష్ రెడ్డి అమెరికాలో ఉంటాడు. రేవంత్ అమెరికా పర్యటనకు పోయినప్పుడు.. వెయ్యి కోట్ల డీల్ చేసుకున్నరు. స్వచ్ఛ్ బయో అనే కంపెనీతో ఒక మెమోరాండం సైన్ చేశారు. వాళ్లకు ఎక్కడ భూములు ఇచ్చారో తవ్వి తీస్తామని అన్నారు.
రేవంత్ బామ్మర్ది సృజన్ రెడ్డికి రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టు దక్కింది. రేవంత్ రెడ్డి, మోడీ ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో.. సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే అంతా నడుస్తోంది. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, వేల కోట్ల కుంభకోణాలు అన్నీ బయటపెట్టినం. ఈ పరంపరలో మేం బయటపెట్టిన తాజా కుంభకోణమే టెసరాక్ట్. వడ్డించే వాడే మనోడే అన్నట్టు భూములు కొట్టేశారు. రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని రూ.7 కోట్లకు రాసిచ్చారు. ఇది స్కాం కాదా? పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా? టెసరాక్ట్ కథేంటో తేల్చేదాకా వదిలిపెట్టం. ఆ కంపెనీకి, ముఖ్యమంత్రి సోదరుడికి ఏ సంబంధం లేదని శ్రీధర్ బాబు అంటున్నడు. చైర్మన్ అనుముల కొండల్ రెడ్డి అని వాళ్లే ప్రొఫైల్లో రాసుకున్నరు. కానీ మంత్రి శ్రీధర్ బాబు సిగ్గులేకుండా బుకాయిస్తున్నరు. అసలు ఇవన్నీ మంత్రికి తెలిసి జరుగుతున్నాయా? మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా శ్రీధర్ బాబు గారు? ఈ భూకేటాయింపుల కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం. ముఖ్యమంత్రి సోదరులైతే ఏమైనా చేయొచ్చా? సీఎం అన్న తిరుపతి రెడ్డికి ఏ అధికారిక హోదా ఉంది? కలెక్టర్లు, ఎస్పీలు ఆయనకు వంగివంగి దండాలు పెడుతున్నరని అన్నారు.
==============================

