విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బూట్ల పంపిణీ.
అర్జున్ సమాచారం జులై 12 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:
ఇందారం, ఆగస్టు 12:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన పాఠశాల బూట్ల పంపిణీ కార్యక్రమం బుధవారం ఇందారం గ్రామంలో నిర్వహించారు.
ఇందారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పాఠశాల బూట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్, ఉపసర్పంచ్ ఎల్కటూరి శివ, వార్డు సభ్యుడు దగ్గుల రమేష్ పాల్గొని విద్యార్థులకు బూట్లను అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు సూచించారు.
కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సీనియర్ నాయకులు మాజీ సహకార సంఘం అధ్యక్షుడు జైనొద్దీన్, నల్లి శ్రీకాంత్, యువ నాయకుడు చిప్పకుర్తి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

