న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం:
బుధవారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను భువనగిరి ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిసారు. హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు కారిడార్లో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని చేర్చే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసారు.
గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్కు బదులుగా ఇప్పటికే ఉన్న ఎన్హెచ్-65 (NH-65) కారిడార్ గుండా ఈ మార్గాన్ని నిర్మిస్తే, ఆ ప్రాంతంలోని పట్టణాలు, వాణిజ్య కేంద్రాలు మరియు ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుందని వివరించారు.
ఈ విధంగా మార్గాన్ని మళ్లించడం ద్వారా భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా పూర్తి ప్రయోజనాలు చేకూరుతాయని కోరడం జరిగింది. ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయనను అభ్యర్థించారు.
ఈ సమావేశంలో ఎంపి చామల పాటు నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
=======================

