ePaper
Friday, October 2, 2026
ePaper
Homeజాతీయంసింగరేణి స్థలాల పరిరక్షణపై ఆరోపణలు

సింగరేణి స్థలాల పరిరక్షణపై ఆరోపణలు

📰 Generate e-Paper Clip

సింగరేణి స్థలాల పరిరక్షణపై ఆరోపణలు

కబ్జాలపై ఎస్టేట్స్‌ విభాగం స్పందించడంలేదంటున్న స్థానికులు.ఆర్జీ-3 ఎస్టేట్‌ అధికారిపై విచారణకు డిమాండ్‌.

అర్జున్ సమాచారం // సెప్టెంబర్ 30 // రామగిరి // రిపోర్టర్.

సింగరేణి సంస్థకు చెందిన విలువైన స్థలాలను పరిరక్షించాల్సిన ఎస్టేట్స్‌ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్జీ-3 ఎస్టేట్‌ అధికారి ఐలయ్య వ్యవహారశైలిపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయని, తాజాగా సెంటినరీకాలనీ జోన్‌-2 పరిధిలోని వకీల్‌పల్లి ప్లాట్ల సమీపంలో సింగరేణి స్థలం కబ్జాకు గురవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని వారు పేర్కొంటున్నారు.

వకీల్‌పల్లి ప్లాట్లను ఆనుకుని ఉన్న సింగరేణి స్థలానికి ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను తొలగించి, ఓ వ్యక్తి అక్కడ బౌండరీ ఏర్పాటు చేసి మట్టి పోయించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సింగరేణి స్థలంలోకి ప్రవేశించేలా గేట్‌ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా ఎస్టేట్స్‌ విభాగానికి సమాచారం లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని వారు అంటున్నారు.

ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తికి ఎస్టేట్‌ అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారుల వివరణ వెలువడాల్సి ఉంది. సింగరేణి స్థలాల కబ్జాపై కార్మికులు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకుండా ఫిర్యాదు చేసిన వారిపైనే చర్యలకు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

సింగరేణి ఆస్తుల పరిరక్షణలో నిర్లక్ష్యం చోటుచేసుకుంటే సంస్థకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీ-3 ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, సెంటినరీకాలనీ పరిధిలో సింగరేణి స్థలాలపై జరిగిన ఆక్రమణలను గుర్తించి, సంస్థ భూములను పరిరక్షించాలని వారు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!