ePaper
Saturday, October 3, 2026
ePaper
Homeతెలంగాణరామగిరి ఖిల్లాలో అనుమానాస్పద కార్యకలాపాలపై విచారణ జరపాలి .చర్యలు తీసుకోకపోతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...

రామగిరి ఖిల్లాలో అనుమానాస్పద కార్యకలాపాలపై విచారణ జరపాలి .చర్యలు తీసుకోకపోతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ దృష్టికి తీసుకెళ్తాం.

📰 Generate e-Paper Clip

రామగిరి ఖిల్లాలో అనుమానాస్పద కార్యకలాపాలపై విచారణ జరపాలి .చర్యలు తీసుకోకపోతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ దృష్టికి తీసుకెళ్తాం.

మాజీ బీజేపీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 3 // రామగిరి రిపోర్టర్.

పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిధిలోని చారిత్రక రామగిరి ఖిల్లా ప్రాంతంలో ఇటీవల చోటుచేసుకున్నట్లు చెబుతున్న అనుమానాస్పద కార్యకలాపాలపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని మాజీ బీజేపీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

రామగిరి ఖిల్లా ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు జెండాలు ఏర్పాటు చేయడం, పూజా కార్యక్రమాలు నిర్వహించడం, జంతుబలి ఇచ్చినట్లు, కొన్ని ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టినట్లు సమాచారం వస్తోందని తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతంలో ఇటువంటి కార్యకలాపాలు ఎవరి అనుమతితో జరిగాయి? ఎవరు నిర్వహించారు? వాటి వెనుక ఉద్దేశం ఏమిటి? అనే విషయాలను అధికారులు నిగ్గుతేల్చాలని కోరారు.

రామగిరి ఖిల్లా చారిత్రక వారసత్వ సంపద అని, అధికారిక జిల్లా సమాచారంలోనూ దీనిని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా పేర్కొన్నారని తెలిపారు. ఇలాంటి ప్రాంతాల్లో అనుమతులు లేకుండా కార్యకలాపాలు జరుగుతున్నాయనే సమాచారం వస్తే అధికారులు వెంటనే స్పందించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.

ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఖిల్లా పరిరక్షణతో పాటు ఘటన వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్తామని మొలుమూరి శ్రీనివాస్‌ తెలిపారు. బండి సంజయ్‌కుమార్‌ ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నట్లు కేంద్ర హోంశాఖ అధికారిక సమాచారం పేర్కొంటోంది.

ఈ సమావేశంలో సెంటినరీ కాలనీ అధ్యక్షుడు తీగల శ్రీధర్‌, మెరుగు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!