ePaper
Sunday, October 4, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్ఎన్‌హెచ్‌ఐఎస్‌ పథకం వంద శాతం అమలు. మంచిర్యాల ఉద్యోగులకు టీఎన్జీవో జిల్లా కమిటీ భరోసా,

ఎన్‌హెచ్‌ఐఎస్‌ పథకం వంద శాతం అమలు. మంచిర్యాల ఉద్యోగులకు టీఎన్జీవో జిల్లా కమిటీ భరోసా,

📰 Generate e-Paper Clip

ఎన్‌హెచ్‌ఐఎస్‌ పథకం వంద శాతం అమలు. మంచిర్యాల ఉద్యోగులకు టీఎన్జీవో జిల్లా కమిటీ భరోసా,

మంచిర్యాల: అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 3.

.అనారోగ్య సమస్యలతో కరీంనగర్‌లోని మెడికల్‌ కవర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల తహసీల్దార్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ అక్కల స్వప్నను టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఉద్యోగులకు అందుతున్న ఎన్‌హెచ్‌ఐఎస్‌ వైద్య సేవలు సమర్థవంతంగా అమలవుతున్నాయా అనే అంశంపై పరిశీలన నిర్వహించారు. కరీంనగర్‌లోని మెడికల్‌ కవర్‌ ఆసుపత్రిలో ఎన్‌హెచ్‌ఐఎస్‌ సేవలు సమర్థవంతంగా అమలవుతున్నట్లు ఈ సందర్భంగా వెల్లడైనట్లు టీఎన్జీవో నాయకులు తెలిపారు.

మారం జగదీశ్వర్‌ వెంట టీఎన్జీవో నాయకులు, జిల్లా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఉద్యోగి అక్కల స్వప్నను కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌ పరామర్శించడం పట్ల మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని ఉద్యోగులందరూ ఎన్‌హెచ్‌ఐఎస్‌ వైద్య పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!