ePaper
Wednesday, October 14, 2026
ePaper
Homeతెలంగాణఓటు నమోదుకు మరో అవకాశం..సీఈవో సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన,

ఓటు నమోదుకు మరో అవకాశం..సీఈవో సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన,

📰 Generate e-Paper Clip

ఓటు నమోదుకు మరో అవకాశం..సీఈవో సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన,

హైదరాబాద్, అక్టోబర్ 14, అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబరు 14,
:
తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా అర్హత సాధించిన వారు, ముసాయిదా జాబితాలో పేర్లు లేని వారి కోసం ప్రత్యేక క్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి  వెల్లడించారు.

ఈనెల 15, 16 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల నమోదు శిబిరాలు నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు. కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువ ఓటర్లు ఈ క్యాంప్‌లను సద్వినియోగం చేసుకుని ఫారమ్-6 దరఖాస్తును సమర్పించి తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సీఈవో సూచించారు.

అదేవిధంగా, ప్రస్తుతం విడుదల చేసిన డ్రాఫ్ట్ జాబితాలో ఎవరి పేరు కనిపించకపోయినా, జాబితాలో పేరు లేనివారు వెంటనే ఫారమ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ స్పెషల్ క్యాంప్‌ల ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారందరి పేర్లను వచ్చే నవంబర్ 9న విడుదల చేయబోయే తుది ఓటర్ల జాబితాలో చేర్చనున్నట్లుగా సీఈవో సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. ఈ సదావకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!