వెస్ట్ బైపాస్ లో కారు దగ్దం..నలుగురు సజీవ దహనం.
విజయవాడ: అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 12.
విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది, ఒక ఈవీ కారు డివైడర్ను ఢీకొని పూర్తిగా తగలబడిపోయింది. కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవదహనం అయ్యారు. వారంతా స్పాట్లోనే దుర్మరణం పాలయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా వుంది. వీరంతా నంబూరులో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు నున్న, నంబూరు వాసులుగా గుర్తించారు. మృతుల్లో నున్నకు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39), ఆయన తల్లి అరుణ వున్నారు. మృతుల్లో మరో చిన్నారితో పాటు నంబూరుకు చెందిన తిగురు విజయ ను గుర్తించారు. క్షతగాత్రుడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు సమాచారం అందుకుని సహాయక చర్యలు చేపట్టారు.

